ప్రైవేటు రంగంలో అదనపు పెట్టుబడులు కష్టమే

PRIVATE investments
PRIVATE investments

ప్రైవేటు రంగంలో అదనపు పెట్టుబడులు కష్టమే

ముంబై,: ప్రైవేటురంగం నుంచి డిమాండ్‌ మందగమనంతో ఉండటంతో భారతీయ కంపెనీలు వచ్చే ఏడాదికాలం పాటు అదనపు పెట్టుబడులకు సిద్ధం అయ్యే సూచనలు కనిపించడంలేదు. విదేశాల్లో వారివారి దేశాల పరిరక్షణ విధానాలతో కొన్ని రంగాలు సతమతం అవుతుండటం కూడా ఇందుకు ఒక కారణంగా ఉంది. ప్రైవేటురంగం ఇప్పటికే అంచనాలకు మించిన సామర్ధ్యంతో ఉందని, మార్కెట్లు క్షీణించాయని ప్రైవేటురంగంలోని భారీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి సిఎప్‌ఒ ఆర్‌.శంకర్‌రామన్‌ వెల్లడించారు. ఈపరిస్థితుల్లో ప్రైవేటు రం గంలో అదనపు పెట్టుబడులు మరో ఏడాదిపాటు రాకపోవచ్చన్న అభి ప్రాయం వ్యక్తంచేసారు. వచ్చే ఒకటిరెండేళ్లలో ఇదేవిధానం కొనసాగే అవకాశం ఉందన్నారు. ఇతర మేజర్‌ దేశాలతోపోలిస్తే భారత్‌ శరవేగం గా వృద్ధిసాధిస్తున్న దేశంగా నిలిచిందని, కంపెనీలకు రుణాలు ఇప్ప టికీ మందగమనంతోనే ఉన్నాయని, బ్యాంకర్లు రానిబాకీలు, మొండి బకాయిలతో సతమతంఅవుతున్నాయని, కార్పొరేట్లకు గత 25 యేళ్లు గా రుణపరపతి స్తబ్దుగానే ఉందని ఆయనఅన్నారు.

వీటికితోడు ప్రభు త్వం నవంబరులో పెద్దనోట్ల రద్దు అంటే చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దుచేయడంతో ఒక్కిసారిగా వినిమయశక్తిపడిపోయిం దని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పానా యంత్రాంగం కంపెనీలను మేకిన్‌ ఇండియాకు ప్రోత్సహిస్తున్నాయని 59బిలియన్‌ డాలర్ల మౌలిక వనరులరంగానికి జవసత్వాలు మరింత అవసరమని ఆయన అన్నారు. ఎల్‌అండ్‌టి రాబడులపరంగా 50శాతం మౌలికవనరులు, ఐటిరంగం, ఆర్థికసేవలు, రక్షణరంగాల నుంచే సమకూర్చుకుంటున్న ది. ప్రస్తుతం 65శాతంగా ఉన్న వినిమయ స్థాయి 85శాతానికి పెరగా లని అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో కూడా మార్పులు రావాల న్నారు. ముంబైకేంద్రంగా ఉన్న కంపెనీ జనవరిలో తన రాబడులు, ఇన్‌ఫ్లో ఆర్డర్లు కూడా తగ్గినట్లు గుర్తించింది. ప్రాజెక్టు క్లియరెన్సుల్లో జాప్యం, ఆర్డర్లకు బిడ్డింగ్‌, క్షీణించిన నీరసించిన పెట్టుబడుల వాతా వరణంతో రాబడులు తగ్గుతాయనే అంచనావేసింది.ఎల్‌అండ్‌టి మార్జి న్లు మార్చి 31వతేదీతో ముగిసిన సంవత్సరకాలానికి 13 శాతంనుంచి 11శాతానికి తగ్గినట్లు బ్లూంబర్గ్‌ గణాంకాలు చెపుతున్నా యి.

13శాతం నిర్వహణ మార్జిన్‌ స్థిరమైన మార్జిన్‌ కాదని, 11శాతం రాబడులు ఇబిడిటిగా పరిగణించడం కొంత మెరుగుపడినట్లేనని రామన్‌ వ్యాఖ్యానించారు. కంపెనీ ఇటీవలే 14వేల మంది తాత్కాలిక కార్మికులకు గుడ్‌బై చెప్పింది. కొన్నిఆస్తులను లాభదాయకత పెంపు దల కోసం విక్రయించింది. తమిళనాడులోని కట్టుపల్లి రేవును కూడా విక్రయించేందుకు క్లియరెన్సులకోసం వేచి చూస్తోంది. పంజాబ్‌లోని విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌నుంచి కూడా వైదొలగాలని చూస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ మంద గమనాన్ని సంస్థాగతంగా పటిష్టతకోసం వినియోగిస్తా మని, నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడంద్వారా లాభదాయకత పెంపుకోసం కృషిచేస్తున్నట్లు వివరించారు. కంపెనీ వచ్చే ఐదేళ్లలో తన రాబడులను రెట్టింపుచేసు కోగలదని దీమా వ్యక్తంచేస్తోంది. రేండేళ్లకాలానికి పునరేకీ కరణతో కొంత వృద్ధిని సాధిస్తామని వెల్లడించింది. మరో మూడేళ్లపాటు పటిష్టమైన విస్తరణప్రణాళిక అమలవుతుందన్నారు. ఎల్‌అండ్‌టి షేర్లు 0.8శాతంపెరిగి 1488.65రూపాయలకు చేరాయి.