‘ప్రైవేటు బ్యాంకు’లకు కలిసిరాని 2018

private banks
private banks

న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగానికి 2018 సంవత్సరం కష్టకాలమేనని చెప్పాలి. అనేక అవకతవకలు, క్విడ్‌ప్రోకో వ్యవహారాలు, యాజమాన్య అతర్యుద్ధాలు వంటి వాటితో ఈ బ్యాంకింగ్‌ రంగం కొంత ఒత్తిళ్లకు లోనయింది. మొట్టమొదటిసారిగా రానిబాకీల సమస్య ప్రభుత్వరంగ బ్యాంకులను కుదిపేస్తేప్రైవేటురంగ బ్యాంకుల్లోను తక్కువేమీ లేవు. అయితే వీటిలో ఇన్వెస్టర్లు, ప్రైవేటు బ్యాంకులమధ్య తగాదాలే ఎక్కువ నడిచాయి. ఐసిఐసిఐబ్యాంకు ఉదంతంతో ప్రారంభం అయిన ప్రైవేటు బ్యాంకింగ్‌ లావాదేవీలు యాక్సిస్‌బ్యాంకు కోటక్‌ మహీంద్ర ఇతర బ్యాంకులనుసైతం తాకింది. ఎండిసిఇఒ చందాకొచ్చర్‌ వీడియోకాన్‌గ్రూప్‌కు ఇచ్చిన రుణపరపతిపై ఆమె భర్త కంపెనీలో వీడియోకాన్‌ పెట్టుబడులు పెట్టడం వంటివి ఆమెపై అపవాదులు వచ్చి ఆమె నిష్క్రమణానికి దారితీసాయి. ఇక కొచ్చర్‌ మాజీ సహచరి ఐసిఐసిఐబ్యాంకులోనే శిఖా శర్మ యాక్సిస్బఆ్యంకును 2009నుంచి నడుపుతూ వచ్చారు. రిజర్వుబ్యాంకు ఆమె పదవీకాలం పొడిగింపునకు అంగీకరించకపోవడంతో ఆమె దిగిపోక తప్పలేదు. బ్యాంకు రానిబాకీల నివేదికల్లో తప్పులు చూపించిందని, బ్యాంకింగ్‌ పర్యవేక్షణ సంస్థ ఆర్‌బిఐ నిబందనలకు అనుగుణంగా వ్యవహరించలేదన్న అపవాదులు బ్యాంకును కుదిపేసాయి. మరో ప్రైవేటుబ్యాంకు ఎస్‌బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ పదవీకాలాన్ని సైతం పొడిగించేందుకు ఆర్‌బిఐ అంగీకరించలేదు. 2019 జనవరి 31వ తేదీలోపు ఆయన పదవినుంచి వైదొలగాల్సి ఉంది. రానిబాకీలపరంగా బ్యాంకు సహేతుకమైన వివరాలు అందించలేదన్నది ఆర్‌బిఐ అభియోగం. ఇకప్రైవేటు రంగ బ్యాంకులపరంగా అగ్రస్థాయిలో ప్రభుత్వ బ్యాంకులకంటే కొంత మెరుగైన పనితీరునే కనబరిచాయి. ఎక్కువగా ఎన్‌పిఎల వివరాలపరంగానే ఇవి ఆరోపణలు ఎదుర్కొన్నాయి. కోటక్‌ మహీంద్ర బ్యాంకుకుసైతం సంక్లిష్టసవాళ్లు ఎదురయ్యాయి. ప్రమోటర్‌ ఉద§్‌ుకోటక్‌ తన వాటాను 30 నుంచి 20శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది. డిసెంబరు 31వ తేదీనాటికే తగ్గించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకుప్రాధాన్యతా షేర్లను జారీచేసి తన వాటాను తగ్గించుకునేందుకు ఉపక్రమించింది. అయితే ఆర్‌బిఐ బ్యాంకు ప్రమోటర్‌ వాటాను తగ్గించుకునే క్రమంలో ప్రభుత్వ నిబందనలప్రకారం లేదని వెల్లడించడంతో కోటక్‌ బాంబే హైకోర్టు గడపతొక్కారు. ్పఐవేటు బ్యాంకుల అధిపతులు చందాకొచ్చర్‌, శిఖాశర్మ, రాణాకపూర్‌, ఐడిఎప్‌సి బ్యాంకు ఎండిసిఇఒ రాజీవ్‌ లల్‌, యాక్సిస్‌బ్యాంకు ఎండి సిఇఒ అమితాబ్‌చౌదరి, ఐడిఎఫ్‌సి బ్యాంకు ఎండి సిఇఒ వి వైద్యనాధన్‌ వంటి వారికి 2018వ సంవత్సరం సవాళ్లతో కూడుకున్నదేనని చెప్పాలి. ప్రైవేటురంగంలో అతి పిన్నవయసు బ్యాంకు అయిన బంధన్‌బ్యాంకుసైతం ఆర్‌బిఐ హెచ్చరికలను చవిచూసింది. ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవడంలో నిబందనలు పూరించాలని ఆదేశించింది. కోల్‌కత్తా కేంద్రంగా నడుస్తున్న ఈ బ్యాంకు ప్రమోటర్‌ వాటాను తగ్గించుకోవడంలో విఫలం అయింది. బ్యాంకు లైసెన్సు నిబంధనలను అనుసరించి ఆర్‌బిఐ ఈ బ్యాంకు శాఖల విస్తరణను నిలిపివేసింది. అలాగే ఎండి సిఇఒ చంద్రశేఖర్‌ పరిహారాన్ని సైతం స్తంభింపచేసింది. అలాగే సుపరిపాలన పరంగా కూడా ప్రైవేటురంగ బ్యాంకులు కొన్ని లోపాలను ఎదుర్కొన్నాయి. ఫలితంగా రిజర్వుబ్యాంకు హెచ్చరికలను చవిచూసాయి.