ప్రేమ పేరుతో మోసాలు

Cunnig love effect Woman Sad
Cunnig love effect: Woman Sad

వారిద్దరు ప్రేమికులు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. ఒకే కులం కావడడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే చనువ్ఞతో ఇద్దరు ఏకాంతంగా గడిపేవారు. ఆ అబ్బాయి తన ప్రేయసి నగ్న ఫొటోలను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హింసించసాగాడు. అతడి వాలకం నచ్చని ఆమె పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతుండగానే ఆ ప్రియుడు ఏకంగా తల్లిదండ్రులకే నగ్నఫొటోలను పంపించి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడసాగాడు.

ఇద తెలిసి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎలాగో బయటపడి, చికిత్స పొందుతున్నది. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని, ఒకమ్మాయిని ఊబిలో దింపాడు ఇంకో ప్రబుద్ధుడు. ప్రేమ పాఠాలతో పాటు ఆమెను సెక్స్‌వర్కర్‌గా మార్చేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మేల్కోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్నేహంగా ఉంటూనే తన స్నేహితురాలి ఓరోజు ఇంటికి పిలిచాడు. తన బర్త్‌డే అని నీకు ఒక్కదానికే పార్టీ ఇస్తున్నానని నమ్మించాడు. ఇంటికొచ్చిన ఆమెకు కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు.

దాన్ని తాగిన ఆమెకు రెండు గంటల వరకు ఆమెకేమీ తెలియదు. స్పృహలోకి వచ్చసరికి ఒంటిపై బట్టలు లేవ్ఞ. అతడు ఆమపై అత్యాచారం చేసి, వీడియోను తీసాడు. బ్లాక్‌మెయిల్‌ పాల్పడ్డం మాత్రమే కాదు, ఆమె నుంచి లక్షలు గుంజాడు. ఈ వీడియోలను తన స్నేహితులకు కూడా షేర్‌ చేశాడు. వారూ ఆమె నుంచి డబ్బు లాగే ప్రయత్నం చేశారు. చివరికి ధైర్యం చేసిన ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సైబర్‌ నేరం కింద వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో యువతులను మోసగించడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నది. దీనికి కారణం సహజీవనం. వివాహానికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి జీవించడం. పెళ్లి కాకుండానే భార్యాభర్తల బంధాన్ని కొనసాగిస్తారు. తర్వాత నచ్చితే పెళ్లి లేకపోతే విడిపోవడం చేస్తారు. లిప్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌ అనండి. సహజీవనం అనండి. లివింగ్‌ టుగెదర్‌ అనండి. పేరేదైనా అనుబంధం ఒకటే. కానీ అందులో వివాహబంధం మాత్రం ఉండదు.
ఇందులో ముఖ్య భూమిక యువతరానిదేనని వేరే చెప్పాలా? ఈ అనుబంధంలో అన్నీ మామూలే. అతడు కూరగాయలు తరిగితే ఆమె వంట చేస్తుంది. ఆమె ఆఫీసుకెళ్తే అతను దిగబెడతాడు. ఆమెకు జబ్బు చేస్తే మందులిప్పించేది అతడే. అయినా వాళ్లు భార్యాభర్తలు కాదు. వాళ్ల ఇంటి పక్క వాళ్లకిది నచ్చకపోవచ్చు. అసలీ భావనకే ప్రజాదరణ లేకపోవచ్చు.

అయినా ఈ సంబంధం చట్టవ్యతిరేకం మాత్రం కాదని తేలిపోయింది. ఈ సహజీవన సంబంధాలు కేవలం సినిమా స్టార్లు, ధనవంతులకే పరిమితం అనుకుంటే పొరపాటే. నగరాల్లో సైతం ఇలాంటి జంటలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ నవీన పోకడకి కారణాలేంటని ఒక్కసారి ఆరా తీయండి. పాశ్చాత్య ప్రభావం, నగరీకరణ, ఆర్థిక స్వాతంత్య్రం, ఇంటర్నేట్‌ ఇలా బోలెడు కనపడతాయి. వీటన్నింటింటే ప్రధాన కారణం మనుషుల మధ్య కనుమరుగవ్ఞతున్న అనుబంధాలు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడిన సమాజం ఇప్పుడు న్యూక్లియర్‌ ఫ్యాషన్‌తో నిండిపోయింది. నగరాల్లోని చాలామంది తల్లిదండ్రులకు యవ్వనంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో గమనించే తీరిక కూడా ఉండటం లేదు. డాలర్ల వేటకోసం విదేశాలకెళ్లి అక్కడి సంస్కృతికి ఆకర్షితులవ్ఞతున్న వారి సంగతి సరేసరి. ఆర్థిక సంస్కరణల పుణ్యమాని సాఫ్ట్‌వేర్‌, హాస్పిటాలిటీ, విమానయాన రంగాలతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది.

యువతకు చిన్న వయసులోనే పెద్దమొత్తంలో వేతనాలు అందడంతో ఆర్థిక స్వాతంత్య్రం లభించింది. ఎమ్మెల్సీ, కార్పొరేట్‌ ఆఫీసుల్లో పనిచేసే యువతీ యువకులు రోజూ గంటలపాటు కలిసి పనిచేయడం ఇందుకు వూతమిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. సహజీవనంతో ఒక్కటైనా కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్న సందర్భాలు కూడా లేకపోలేదని సైకాలజిస్ట్‌లు అంటున్నారు.

కొన్ని లాభాలున్నాయి…

సహజీవనాన్ని ఫాలో అయ్యేవారిని కదిపి చూస్తే బోలెడు కారణాలు చెబుతారు. ఆడ, మగ అనే తేడాలుండవ్ఞ. ఇద్దరికీ సమాన అవకాశాలు, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు. వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం ఉండదు. తీవ్రమైన ఫెమినిస్ట్‌ భావాలున్న అమ్మాయిలకు ఇది చక్కగా సూటవ్ఞతుంది. ఇంటి పేరు మారదు. సమాజంలో బలంగా నాటుకుపోయిన కట్నం, గృహహింసలకు చోటుండదు. నామాటే వినాలి అనే మొండితతానికి తావ్ఞండదు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ ఆలోచన లేదు. ఇద్దరి భావాలు మరీ తేడా అనిపించినప్పుడు, కలిసి భవిష్యత్తులో జీవించలేం అనుకున్నప్పుడు సింపుల్‌గా ఎవరి దారి వారిదే. దీనికోసం కోర్టుల చుట్టూ తిరిగి, డబ్బు, సమయం వృధా కాదు.

నష్టాలు ఉన్నాయి…

వివాహ బంధమంత పటిష్ఠత సహజీవనంలో ఉండదు. చిన్నచిన్న అభిప్రాయాల విభేదాలకే విడిపోవచ్చు. సహజీవనం చట్టబద్ధమైన జర్మనీ, అమెరికాలే ఇందుకు ఉదాహరణ. సమాజం, బంధువ్ఞల సాయం పొందలేరు. ఆర్థికంగా మంచి పరిస్థితి ఉన్నంతవరకే కొనసాగుతుంది. కేవలం శారీరక వాంఛలకే ఇది పరిమితం. ఈ జంటలకు పుట్టిన పిల్లలు సమాజంలో వివక్షకు గురవ్ఞతారు. ఇది కొనసాగితే కుటుంబ వ్యవస్థ బీటలువారే అవకాశముంది. ఏదీఏమైనా ఇందులో ఇబ్బంది పడేది మాత్రం అమ్మాయే.
మగవారు సింపుల్‌గా ఏమైనా తప్పించుకోగలరు. కానీ ఆడవారు అన్నింటిని భరించాల్సిందే. కాబట్టి ఉద్యోగం చేసేవారైనా చేయనివారైనా అమ్మాయిలు సహజీవనం మన దేశ సంప్రదాయం కాదు, దానివల్ల వచ్చే నష్టాలకు బలైయ్యేది మాత్రం మీరేనని గ్రహించి, ఆకర్షించే ఆ ఊబిలో చిక్కుకోకండి. అబ్బాయి మర్చిపోయినంత సులభంగా అమ్మాయిలు మర్చిపోలేరు.

అబ్బాయికి మోజు తీరిపోయిన తర్వాత ఆమెపట్ల మునుపు ఉన్న అనురాగం, ప్రేమ వ్ఞండదు. పైగా సరైన కేర్‌ కూడా ఉండదు. ప్రేయసీ జీతంపై ఉన్న ప్రేమ ఆమెపై ఉండదు. ఇంకా కొంతమంది అయితే ఆమె పేరిట ఉన్న ఆస్తుల గురించి ఆరా తీస్తారు. ఆస్తిపాస్తుల అంచనాలతో వెంటబడతారు. ఆస్తులను తమ పేరిట రాయించుకునేందుకు ఆడాల్సిన నాటకాలన్నీ ఆడుస్తుంటారు. చెప్పలేనంత ప్రేమను చూపుతున్నట్లు నటిస్తారు. వీటన్నింటినీ చూసి, ప్రియురాలు అబ్బో! తన ప్రియుడు ఎంత గొప్పవాడో అనుకుని, మోసపోతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/