ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని లేడీ డాక్టర్‌ ఆత్మహత్య!

Suicide1
Suicide

హైదరాబాద్‌: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని లేడీడాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాకు చెందిన గీతాకృష్ణ ఎంబీబీఎస్‌ చదివారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో
పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన నరేశ్‌ అనే యువకుడు పరిచయం కావడంతో వారిమధ్య ప్రేమ చిగురించింది. నరేశ్‌ను
పూర్తిగా నమ్మిన గీతాకృష్ణ అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు వద్దని చెప్పిన నరేశ్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పి దిల్‌సుఖ్‌
నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో నరేశ్‌ వేధింపులు భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గీతాకృష్ణ
తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు
ప్రారంభించారు.