ప్రేక్షకుల ఆదరణకు ‘ఫిదా’

FIDA 50 days FUNCTION
FIDA 50 days FUNCTION

ప్రేక్షకుల ఆదరణకు ‘ఫిదా’

వరుణ్‌తేజ్‌, సాయిపల్లకి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందించిన సినిమాకు శేఖర్‌ కమ్ముల దర్శకుడు. దిల్‌రాజు , శిరీష్‌ నిర్మాతలు. సినిమా జూలై 21న విడుదలైంది.. త్వరలోనే 50 రోజులను పూర్తిచేసుకున్న ఈసినిమా అర్ధశతదినోత్సవ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.. కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, మా దర్శకుడుశేఖర్‌ హాలిడేకు వెళ్తున్నారు.. అలాగే మా హీరో వరుణ్‌తేజ్‌ తదుపర ఇమూవీ కోసం లండన్‌ వెళ్తున్నారు.. అందుకనే మరో నాలుగు రోజుల తర్వాత 50 రోజులు పూర్తిచేసుకుంటున్న ఫిదా సినిమా వేడుకను ఇవాళే నిర్వహిస్తున్నామన్నారు.. 20 ఏళ్లు డిస్ట్రిబ్యూటర్‌గా, 14 ఏళ్లు నిర్మాతగా సాగిస్తున్న కెరీర్‌లో 7 వారంలో కూడ థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ కావటం అనేది ఈ మధ్య బాహుబలి తర్వాత మా సినిమాకే జరిగిందన్నారు.. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌ అన్నారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ, గట్టిగా అనుకుంటే జరుగుతుందని చాలా మంది అంటుంటారు.. అలా మ ఏము కూడ ఫిదా గురించి గట్టిగా అనుకుని ఉంటాం.. అందుకే సినిమాకు మంచి రెస్పాన్స వచ్చిందన్నారు. హ్యాపీడేస్‌ తర్వాత ఈ రేంజ్‌ రెస్పాన్స్‌ రావటం చాలా సంతోషం అన్నారు.. సాయిపల్లవి మాట్లాడుతూ, ఈ వేడుక చూస్తుంటే యూనిట్‌ అంతా రీ యూనియన్‌లా కన్పిస్తుంది ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన దిల్‌రాజు , శేఖర్‌కమ్ముల గారికి ధన్యవాదలు తెలిపారుఎ.
హీరో వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ, ఈ వేడు గురించి దిల్‌రాజుగారు రెండు మూడు వారాలే క్రితమే చెప్పారని, సినిమాకు సూపర్‌రెస్పాన్స్‌ వస్తోందని అన్నారు. ఇంత మంచి సినిమాను మాతో చేసినందుకు శేఖర్‌గారికి థ్యాంక్స్‌ అన్నారు. అనంతరం యూనిట్‌కు 50 రోజుల షీల్డ్‌ను అందజేశౄరు.. కార్యక్రమంలో శిరీష్‌, జీవన్‌బాబు, గీతాభాస్కర్‌ పాల్గొన్నారు.