ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయ్‌!

RAILWAYS
RAILWAYS

న్యూఢిల్లీ: రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయి. ఆహార పదార్థాలపై జీఎస్‌టి ఛార్జీలను తగ్గించడంతో టిక్కెట్‌ ధరలు కూడా కిందకి దిగొచ్చినట్లు తెలిసింది. సోమవారం నుంచి రైళ్లు, ప్లాట్‌ఫామ్‌ వద్ద విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకుల ధరలను ఇండియన్‌ రైల్వేస్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సిటిసి) తగ్గించింది. దీంతో మీల్స్‌ ధరలు కలిసి ఉండే ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు కూడా తగ్గాయి. జిఎస్‌టి రేటును తగ్గించడంతోనే ఆహార పదార్థాల ధరలు తగ్గించామని ఐఆర్‌సిటిసి తెలిపింది. రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు విక్రయంచే ఆహార పదార్థాలు, డ్రింకులన్నింటిపై కూడా ఒకేవిధమైన జిఎస్‌టి రేటు 5శాతాన్ని విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతితెలిసిందే. అంతకుముందు ఈ రేటు 18శాతంగా ఉండేది. ఈ రేటును 18శాతం నుంచి 5శాతం తగ్గించడంతో, ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు ఒక్కో టిక్కెట్‌పై రూ.40నుంచి రూ.60 మధ్యలో దిగొచ్చాయి. రైల్వే లైసెన్సులతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జిఎస్‌టి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశీయ రైల్వే మొబైల్‌, స్టాటిక్‌ కేటరింగ్‌కు పలు రేట్లను అమలు చేస్తోంది.