ప్రి-ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్న జార్ఖండ్‌ ప్రభుత్వం

children
children

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ ప్రభుత్వం 25000 ప్రాథమిక పాఠశాలల్లో ప్రి-ప్రైమరి తరగతులను
ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఐతే రాష్ట్ర విద్యా శాఖ సలహా మేరకు క్యాబినెట్‌
ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ‘శిశు సదన్‌ అనే పేరుతో కొనసాగుతుంది.
ఐదారేళ్ళ మధ్య వయస్సు గల పిల్లలను చేర్చుకొని, వారికి తమ మాతృభాషలోనే
బోధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంతో పిల్లల్లో చదువు పట్ల ఉత్సాహం, పాఠశాలకు
రావాలన్న ఆత్రుత, డ్రాపౌట్స్‌ కూడా తగ్గే అవకాశం ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శి ఆరాధనా
పట్నాయక్‌ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రమంతా కలిపి 4 లక్షల విద్యార్ధులు చేరతారని
అంచనా.