ప్రారంభమైన జపాన్-ఇండియా మారిటైం ఎక్సర్సైజ్

ఘనంగా ప్రారంభమైన జపాన్-ఇండియా మారిటైం ఎక్సర్సైజ్
విశాఖపట్నం : జపాన్- ఇండియా మారిటైం ఎక్సర్సైజ్ (జెఐఎంఎస ్డిఎఫ్) అదివారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమం అక్టోబరు15 వరకు నిర్వహించ నున్నట్టు ఈస్ట్రన్ నావల్కమాండ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా జపాన్‌కు చెందిన కాగా షిప్, లుజుమోక్లాస్ హెలికాఫ్టర్ డిస్ట్రోయర్ అండ్ ఇంజుమా విశాఖకు ఆదివారంచేరుకున్నాయి. ఈయుద్దనౌకలు ఎస్కార్టు ఫ్లోటిలియా కమాండర్ రియర్ అడ్మి రల్ టట్సుయా ఫుకాడా నేతృత్వంలో ఈ జపాన్-ఇండో మారిటైం థర్డు ఎడిషన్ భారత నావికాదళం యుద్దనౌకలతో ఎక్సరుసైజ్ల్లో పాల్గోనున్నాయి. ఈ మారిటైంను రెండు దేశాల నావికాదళాల మధ్య, అయా నావల్కమాండ్ల పరిధిలో ఉన్న యుద్దనౌకల పనితీరుపైన, వాటివినియోగంపైన అవగాహన కల్పించుకు నేందుకు, రెండు నావికాదళాల మధ్య సుహృ ద్బావ పరిస్థితి ఏర్పరిచేందుకు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
భారత నావికాదళం మూడు రూపొందించి, నిర్మించిన ప్లీట్టాంకర్లతో ఈ కార్యక్రమాలలో పాల్గొనుంది. ఈఫ్లీట్లో ఐఎన్ఎస్ సాత్పురా, యాంటీ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ కడ్మాల్టు, మిస్సైల్ కర్వెటె ఐఎన్ఎస్ శక్తి, పిబిఐ లాంగ్రేంజ్ మేరిటైం కాపలా హెలిక్రాఫ్ట్ పాల్గొంటున్నాయి. ఈ ఎక్సరుసైజ్లు ఎనిమిదిరోజులు కొనసాగుతాయని, హార్మరుఫేజ్ నాలుగు రోజులు, సీఫేజ్ నాలుగు రోజులు ఉంటాయన్నారు. ఈ ఎక్సరుసైజ్లలో సీఫేజ్లో భాగంగా వృత్తిపరమైన మరియు సాంఘికపర మైన అంశాలపై చర్చించడం, క్రీడా విభాగలుపైన జరుగుతుందన్నారు. అదేవిధంగా యాంటీ సబ్‌మెరైన్ వార్ఎక్సరుసైజ్, విబిఎస్ఎస్ (విజవల్,బోర్డు,సెర్చి అండ్ సీజూర్) డ్రిల్స్, గన్ఫైరింగ్స్, క్రాస్‌డెక్ హెలో అపరేషన్స్, కో-ఆర్డినేట్ ఆపరేషన్స్ కూడా ఉంటాయన్నారు. గతంలో ఈ జెఐఎంఇఎక్ప్ ఫ్లీట్ 2013లో చెన్నై లో నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు. మరలా 5సంవత్సరాల తర్వాత ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు