ప్రాపంచిక వ్యామోహాలు దైవం కోసమే

                 ప్రాపంచిక వ్యామోహాలు దైవం కోసమే

 

MASJID
MASJID

మానవ సమాజంలో భిన్నభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులుంటారు. ఒక్కొ క్కరి అభిరుచిలోను, నడవడిలోను, లక్ష్యాలలోను వైవి ధ్యముంటుంది. మనుషులు రూపాలు ఒకటేయైనా మనసులు వేరుగా ఉంటాయి. ఒక మనిషి సజ్జనుడా? దుర్జనుడా? అన్న విషయం అతనితో కలసి తిరగడం వలన తెలుస్తుంది. అప్పుడే వాని నిజస్వరూపాన్ని చూడ గలం. మనిషి కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకున్న నాడే అతనికి శాంతి, విశ్రాంతి దొరుకుతుంది. అలా కాక ఇంద్రియలోలుడై, కోర్కెలకు లోనైనాడు పతనం తప్పదు.షైతాన్‌ మనిషి మనస్సులో ప్రేమాభి మానాలు నింపుతూ, రుజుమార్గంలో ఉంటూనే పక్కదారి పట్టిస్తుంటాడు. కొందరు నిర్మలమైన భక్తితో దేవ్ఞని ఆరాధిస్తూ ఉంటారు.

అలాంటి పరిస్థితి లో షైతాన్‌ అతణ్ణి ప్రక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ దైవభక్తుడు ”మేము అల్లాఃకు దగ్గరైతే ప్రజల దృష్టిలో మా గౌరవం పెరుగుతుంది. విలువ అభివృద్ధి చెందుతుంది. పెద్దపెద్ద ధనవంతులు, పెద్దపెద్దనాయకులు మొదలైన వారితో సంబంధం పెట్టుకోవచ్చు.మన పనులన్నీచేసుకోవచ్చుఅనే అభిప్రాయాలను వారిలో నాటుతాడు. ఇలా ఆ భక్తుడు దైవచింతన, ఆరాధనలను అశ్రద్ధ చేస్తాడు. తత్ఫలితంగా మనిషి సంకల్పం వలన అది ప్రాపంచిక లాభాలకే పరిమితమైపోయింది. ఒకవేళ ఏ భక్తుడయినా అల్లాహ్‌ కు ప్రియమైన దైవభక్తుల వద్దకు గాని, ఆధ్యాత్మిక గురువ్ఞల వద్దకు గాని, నిష్టాగరిష్టులైన గొప్ప తత్వవేత్తల వద్దకు గాని ధార్మిక విషయాలను తెలుసు కొనే నిమిత్తం, ధర్మతత్వాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో వారి వద్దకు జిజ్ఞాసతో వెళ్ల అభ్యసిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో పోతే అది దైవప్రేమకు తప్పక పాత్రమౌతుంది.

ఈప్రేమకు దైవం లెక్కలేనన్ని పుణ్యఫలాలను ప్రసాదిస్తాడు.ప్రాపంచిక వ్యామోహాలు దైవం కోసం కేటాయించాలి. మనిషికి ప్రాపంచిక వ్యామోహాలు- అంటే తల్లిదండ్రులపై ప్రేమ, అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్ర పై ప్రేమ, భార్యాపిల్లలపై ప్రేమను ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు. ఇంకా మనిషి బంధువ్ఞలపై, మిత్రులపై వ్యామోహం చూపుతు న్నాడు. ఇలా అందరి ఎడల చూపించడం ప్రాపంచిక వ్యామోహం క్రిందికే వస్తుంది. అయితే ఈ వ్యామోహాన్నే, ఈ ప్రేమనే తన దృష్టి కోణాన్ని మరల్చి దైవం కోసమనే నిర్ణయం తీసుకుంటే, ఆ మమకారాలు, ప్రేమాభిమానాలు దైవంకోసమేఅని. అల్లాహ్‌ ఆయన ప్రవక్త(ష) ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంగారి నియమనిబంధనల మేరకు అనే సంకల్పంతో ప్రవర్తిస్తే ఆ ప్రేమ దైవం దృష్టిలో ఉన్నతమైన ప్రేమగా నిలుస్తుంది. మహ నీయ ప్రవక్త ముహమ్మద్‌(స) తల్లిదండ్రులపై ప్రేమతో వ్యవహరించండి అని అన్నారు.

ఇంకా ఏ వ్యక్తి అయినా తల్లితండ్రుల ఎడల ప్రేమాభిమానా లు, వారికి ఎలాంటి బాధ కలిగించకుండా సంతోషం కలిగిస్తే ఆ వ్యక్తికి అల్లాహ్‌ ఒక హజ్‌, ఒక ఉమ్రా చేసినంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. భార్యపై ప్రేమ కూడా దేవ్ఞని కోసమే. ప్రతి ఒక్కరికీ తమ భార్యమీద అపారమైన ప్రేమ ఉంటుంది. ఇది మానసిక సంబంధమైన వ్యామోహం గల వ్యవస్థ. అయితే ఈప్రేమించడం నేను అల్లాహ్‌ ఆయన ప్రవక్త(స) ముహమ్మద్‌ (స) గారి ఆదేశం సంప్రదాయం ప్రకారం నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అని నీవ్ఞ అనుకొంటే ఆ ప్రేమ దైవం కోసమే అయిపోయింది. ఒక వ్యక్తి దైవప్రేమను పొందేందుకు భార్యను ప్రేమిస్తున్నాడు. మరొక వ్యక్తి మనోవాంఛ కోసం భార్యను ప్రేమిస్తున్నాడు. ఈ ఇద్దరి ప్రేమలు బయటకి చూసేందుకు ఒకేలా కనపడ్డా ఈ రెండు ప్రేమల్లో భూమ్యాకాశాల తేడా ఉంది. దివ్యఖుర్‌ఆన్‌, హదీసుల్లో ఈ విషయం ప్రతిబింబిస్తూ ఉంది.
– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌