ప్రాజెక్టుల‌ను అడ్డుకోవ‌డం ఇక‌నైనా మానుకోవాలిః హ‌రీష్‌

Harish Rao
Harish Rao

న్యూఢిల్లీః కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కాంగ్రెస్‌ ఎన్నో ప్రయత్నాలు చేసిందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం కాళేశ్వరం నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిలుపుదల కోసం కోర్టుల్లో సుమారు 100 కేసులు వేశారని అయినప్పటికీ, న్యాయం గెలిచిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. ఆకుపచ్చ, ఆత్మహత్యలులేని తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకునేవారు తమ ఆలోచనలు మార్చుకోవాలన్నారు. ప్రాణత్యాగానికి సిద్ధమైన కేసీఆర్‌కు పదవులు ముఖ్యం కాదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.