ప్రాక్టీస్‌లో స్మిత్‌ సేన

SMITH1
SMITH1

ప్రాక్టీస్‌లో స్మిత్‌ సేన

ముంబై: నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మైదానం లో అడుగుపెట్టింది.భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండు రోజులకే టెస్టు సిరీస్‌ సన్నాహకాల్లో మునిగిపోయారు. ముంబైలోని బ్రబౌర్స్‌ స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టు సభ్యులంతా పాల్గొన్నారు.కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌,గ్లెన్‌ మాక్స్‌వెల్‌,ఉస్మాన్‌ ఖవాజాలు నెట్స్‌లోని వేర్వేరు వికెట్లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా మరి కొందరు స్లిప్‌ క్యాచింగ్‌లో పాల్గొన్నారు.ముఖ్యంగా స్థానిక స్పిన్‌ బౌలర్లతో పాటు జట్టు స్పిన్‌ కన్సల్టెంట్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లంగా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు.

శుక్రవారం నుంచి జరిగేమూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇండియా-ఎతో ఆస్ట్రేలియా తలపడనుంది.ఆ తరువాత ఫిబ్రవరి 23న పూణే వేదికగాభారత్‌,ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌కుఅధిక ప్రాధాన్యతనిచ్చారు.నెట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తారు.ఈ సిరీస్‌ లో స్పిన్నర్లు అశ్విన్‌,జడేజాలతో ఆసీస్‌కు ప్రధాన సవాల్‌ ఎదురుకానుంది.ఇక భారత టాప్‌ స్పిన్నర్లను ఎదుర్కొనేం దుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు.ప్రత్యర్థి బ్యాట్స్‌ మెన్‌ మనసును చదివి బౌలింగ్‌ చేసే అశ్విన్‌ లాంటి బౌలర్‌ను నేను గౌరవిస్తా.అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడ టం అవసరం.అశ్విన్‌ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్దంగా ఉంది.మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరుగవచ్చు అని వార్నర్‌ వివరించాడు.ఇదిలా ఉంటే ఐసిసి టెస్టు ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా,ఆస్ట్రేలియా జట్టు రెండవ స్థానంలో కొనసాగు తుంది.ఆస్ట్రేలియా చివరిసారి 2013లో భారత పర్యటకు వచ్చి 4-0తో వైట్‌ వాష్‌కు గురైంది.అప్పటి సిరీస్‌లో అశ్విన్‌ 29 వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా ను చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.