ప్రాక్టీస్‌లో టీమిండియా బిజీ

team indai
team indai

ప్రాక్టీస్‌లో టీమిండియా బిజీ

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం నగరానికి చేరుకున్న టీమిండియా బుధవారం కూడా ఉప్పల్‌ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సందడి చేసింది.వార్మప్‌ సెషన్‌కు ముందు జట్టులోని ఆటగాళ్లు స్టేడియంలో ఓర్టెక్స్‌ బంతిని ఒకరి నుంచి మరొకరికి మార్చుకుంటూ బంతి కోసం పోటీపడ్డారు.భారత్‌,బంగ్లాదేశ్‌ జట్ల మధ్య గురువారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్‌ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశారు.మొదట స్టేడియానికి చేరుకున్న కోచ్‌ కుంబ్లే,కెప్టెన్‌ కోహ్లీ స్టేడియంలోని పిచ్‌ను పరిశీలించారు.అనంతరం నెట్‌లో బౌలింగ్‌,బ్యాటింగ చేస్తు ఆటగాళ్లు ఎక్కువ సమయం గడిపారు.కోచ్‌ శ్రీధర్‌ కొట్టిన బంతులను వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌లు పడుతూ ఎక్కువ సమయాన్ని గడిపారు.దీనికి సంబం ధించిన వీడియోలను బిసిసిఐ ట్విటర్‌లో పోస్టు చేసింది.టీమిండియాతో బంగ్లాదేశ్‌ హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ మైదానం ఈ టెస్టుకు వేదిక కానుంది.ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో చిన్న మార్పుచోటు చేసుకుంది.క్రీడాకారుడు అమిత్‌ మిశ్రా గాయపడటంతో అతని స్థానంలో కుల్‌దీప్‌ సింగ్‌ను తీసుకుంది.భారత్‌,ఇంగ్లండ్‌ మధ్య టి20లో అమిత్‌ గాయపడ్డాడు.వైద్యుల సూచన మేరకు అమిత్‌కు విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు అతని స్థానంలో కుల్‌దీప్‌సింగ్‌ను ఎంచుకున్నారు. అజహరుద్దీన్‌ రికార్డు అధిగమించనున్న కోహ్లీ టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు.హైదరాబాద్‌ వేదికగా టీమిండియా,బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టులో కోహ్లీ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది.బంగ్లాతో జరుగనున్న మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధిస్తే టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.ప్రస్తుతం ఈ ఇద్దరు కెప్టెన్లు టీమిండియా 14 టెస్టు విజయాలను అందించి సమంగా ఉన్నారు.కోహ్లీ 15వ విజయం కోసం కోహ్లీ ప్రయత్నం.27 టెస్టు విజయాలతో మాజీ కెప్టెన్‌ ధోని మొట్టమొదటి స్థానంలో నిలువగా,21 టెస్టు విజయాలతో గంగూలీ రెండవ స్థానంలో ఉన్నాడు.వీరిద్దరి తరువాత 14 టెస్టు విజయాలతో అజహరుద్దీన్‌,కోహ్లీ ఉన్నారు. పస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ సేన బంగ్లాదేశ్‌పై అలవోక విజయాన్ని సాధిస్తుండనడం తో ఎటువంటి సందేహం లేదు.ఈ క్రమంలో బంగ్లాతో ఏకైక టెస్టుల్లో అజహరుద్దీన్‌ రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వరుసగా ఐదుటెస్టు విజయాలను కోహ్లీ సాధించిన సంగతి తెలిసిందే.ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ 2015లో తొలిసారి శ్రీలంక పై 2-1తో సిరీస్‌ కైవసం చేసుకున్నాడు.ఆ తరువాతస్వదేశంలో దక్షిణా ఫ్రికాపై 3-0,వెస్టిం డీస్‌పై 2-0,న్యూజిలాండ్‌పై 3-0తో విజయం సాధించాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో కూడా కోహ్లీసేన నెగ్గిన సంగతి తెలి సిందే.ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌ తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ పర్యటకు వచ్చింది. 2000లో టెస్టులో అరంగేట్రం చేసిన తరువాత ఒక్కసారికూడా భారత్‌పై విజయం సాధించలేదు. ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగు తుండగా,బంగ్లాదేశ్‌ 9వ స్థానంలో కొనసాగు తుంది.హైదరా బాద్‌ టెస్టుల్లో నెగ్గిఏ బంగ్లాకు 5 పాయింట్లు వస్తాయి.భారత్‌ 120నుంచి 118 పాయింట్లకు పడిపోనుంది.భారత్‌ నెగ్గితే ఒకే పాయింట్‌ లభిస్తుంది.బంగ్లాతో ఏకైక టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియంలో జరిగినటీమిండియా మీడియా సమావేశంలో కుంబ్లే మాట్లాడుతూ బంగ్లాను తేలికగా తీసుకోబోమని స్పష్టం చేశాడు