ప్రాంతీయ పార్టీలు ఐకమత్యంగా ఉండాలి

KCR, KANIMOLI
KCR, KANIMOLI

చెన్నై: చెన్నైలోని ఐటిసి చోళ హోటల్‌లో కేసిఆర్‌తో డిఎంకె ఎంపి కనిమొళి సమావేశం ముగిసింది. దేశ రాజకీయాలపై గంట పాటు వీరిద్దరూ చర్చించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమైక్య స్పూర్తి పరిఢవిల్లుతుందని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు సాధిస్తాయని ,ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసిఆర్‌ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేసిఆర్‌ చేస్తున్న గొప్ప ప్రయత్నాలను ఎంపి కనిమొళి ప్రశంసించారు. దేశాభివృద్దిలో రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు మరింత ఐకమత్యంగా పని చేయాలని కనిమొళి కోరారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తానని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను సందర్శిస్తానన్నారు.