ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

Parliament
Indian Parliament

 

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు జరిగిన పోలింగ్‌ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌
సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ పోలింగ్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటుహక్కును
వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లోని 62వ రూమ్‌లో పోలింగ్‌ జరిగింది. సాయంత్రం ఏడు గంటలకు
ఫలితాలు వెలువడనుంది. అధికార ఏన్డీయే మద్ధతుతో భాజపా నేత ఎం.వెంకయ్య నాయుడు, కాంగ్రెస్‌
ప్రతిపక్షాల మద్ధతుతో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ ఈ పదవికోసం పోటీపడుతున్నారు.
ఎలక్టోరల్‌ కాలేజీలోని సభ్యుల సంఖ్య నామినేటెడ్‌ సభ్యులతో కలిసి 790. వీటిలో రెండు లోక్‌సభ సీట్లు, ఒక
రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. మొత్తం 14 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.