ప్రముఖ కమెడియన్‌ కికూశ్రద్ధా అరెస్ట్‌

Kiku sharda
హైదరాబాద్‌ : టీవి షోల ద్వారా పాపులారిటీ పొందిన కమెడియన్‌ కికూ శ్రద్ధాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక మత గురువు బాబా గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ను అనుకరించడంతో ఆయనను అభాసుపాలు చేశారన్నది అభియోగం. గత నెల 27వ తేదీన కికూశ్రద్ధ చేసిన కామెడీ విత్‌ కపిల్‌ అనే టీవీ షోలో బాబా గుర్మీత్‌ను అనుకరించారు. ఆ విషయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అతని భక్తులు హరియాణా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారి పిటిషన్‌పై స్పందించిన కోర్టు కికూను అరెస్ట్‌ చేసి అమ ఎదుట హాజరు పరచాలని ముంబయి పోలీసులను ఆదేశించింది. ఆ మేరకు వారు అతనిని అరెస్ట్‌ చేసి హరియాణా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది.