ప్రమాదం అంచున ప్రజారోగ్యం

HEALTH CHECK
HEALTH CHECK

ప్రమాదం అంచున ప్రజారోగ్యం

ఎంతో ఆధునిక విజ్ఞానం సముపార్జించుకు న్నామని విర్రవీగే మానవజాతిపై ప్రకృతి విసురుతున్న సవాల్‌కు వారూ వీరు అనే తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు. ఆ శక్తిముందు మానవ్ఞడు ఎప్పటికీ తలవంచుకోవాలనే వాస్తవాన్ని చాటు తూ ప్రజారోగ్యంపై రకరకాల వ్యాధులు దాడులు చేస్తున్నా యి. వాస్తవంగా సైన్స్‌ఎంతో అభివృద్ధిచెందింది. రకరకాల మందులు కనుగొన్నారు. సాంకేతిక పరికరాలు అందుబాటు లోకి వచ్చాయి.అయితే అంతకు రెట్టింపుస్థాయిలో వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ రంగంలోని వైద్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది. పాలకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కేటాయిస్తున్నా డాక్టర్లను నియమిస్తున్నా, సామాన్య ప్రజలకు వైద్యం అందించడంలో సఫలీకృతం కాలేకపోతున్నారు. అటు ప్రైవేట్‌రంగం పూర్తిగా వ్యాపార ధోరణిలోనే వ్యవహరిస్తున్నది. సామాన్యులు అందుకోలేని విధంగా చికిత్సఖర్చులు పెంచేశారు. అసలు రోగనిర్ధారణకై రకరకాల పరీక్షలతో ఆర్థికంగా మోయలేని భారం మోపుతు న్నారు.ఫలితంగా సామాన్యులకు వైద్యం అందని పండుగా తయారవ్ఞతున్నది. ముఖ్యంగా పసిపిల్లల మరణాలు అంత కంతకు పెరగడం ఆందోళనకరంగా మారుతున్నది.

శిశువులకు ప్రాణగండం, గర్భస్తదశనుంచే ప్రారంభంఅవుతుంది. ఈ శిశుమరణాలు నియంత్రించేందుకు పాలకులుచేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య పెరుగుతున్నా భారతదేశం ముందు వరసలో ఉండటం ఆందోళన కలిగిస్తు న్నది.మరణాల్లో దాదాపుయాభై శాతం పుట్టినబిడ్డ ఒక్కరోజు లోనే మరణిస్తున్నది.తొలిమరణాలసంఖ్య విషయంలో పొరు గునున్న పాకిస్థాన్‌, చైనాలాంటి దేశాలతో పోలిస్తే భారత్‌పై స్థానం లోనేఉంది.

వాస్తవంగా భారత ప్రభుత్వం ఈ శిశు మర ణాలు తగ్గించేందుకు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. తల్లి బిడ్డల ఆరోగ్యసాధన కోసం దాదాపునాలుగు దశాబ్దాల క్రితం సమీకృత శిశుఅభివృద్ధి పథకం ఆరంభించారు. లక్ష లాది కేంద్రాలు ప్రారంభించారు. ఈ నాలుగు దశాబ్దాల్లో లక్షలాది కోట్లరూపాయలు వెచ్చించారు.కానీ ఈ శిశుమరణా ల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఇందులో వ్యవ స్థీకరణ లోపాలతో జరుగుతున్న మరణాలు కూడా తక్కువే ేమీ కాదు. పిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలోనే మరణాలు సంభవి స్తున్నాయి. సకాలంలో వైద్యసహాయం అందక మందులు లేక మారుమూల ప్రాంతాల్లో ఎంత మంది అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులు బలైపోతున్నారో లెక్కకు అందవ్ఞ.అవి వెలుగు చూసే అవకాశం కూడా తక్కువే.

ప్రభుత్వ ఆస్పత్రి లో చేర్చి అక్కడ సరైన సకాలంలో వైద్యం అందక కన్ను మూస్తున్న చిన్నారుల గూర్చి బయటకు వస్తున్నాయి. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని బాబారాఘవదాస్‌ గోరఖ్‌పూర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో డెబ్భైమంది చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత యుపిలోని ఫరూకాబాద్‌ ప్రభుత్వఆస్పత్రిలో మరో నలభైఎనిమిది మంది బాలలు కన్ను మూసిన సంఘటన ఉలిక్కి పడేలా చేసింది. ఇలాంటి నిర్లక్ష్యాలు కూడా బాలల మరణాలకు కారణమవుతున్నాయి.

బకాయిల చెల్లింపు సమ స్య కారణంగా ఆక్సిజన్‌ సరఫరాలో కొరత ఏర్పడి చోటు చేసుకున్న ఇలాంటి సంఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. 1980నుంచి గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలోదాదాపు పది వేల మందికిపైగా చిన్నారులు మృత్యువాతపడినట్లు గణాం కాలు వెల్లడిస్తున్నాయి. ఇక డెంగ్యూ, అతిసార, స్వైన్‌ఫ్లూ తదితర వ్యాధులు సోకినప్పుడు చిన్నారులను ఆస్పత్రిలో చేరిస్తేవైద్యం అంతంత మాత్రంగానే అందడంతో పరలోకాని కి పయనం కడుతున్నారు. కేరళలో ఇలాంటి సంఘటనలే జరి గాయి. పెరుగుతున్న వ్యాధులు, రోగులు చాలీచాలని సిబ్బంది, మందుల కొరత ప్రజారోగ్యాన్నిపతనం అంచుకు తీసుకుపోతున్నాయని చెప్పవచ్చు. దీనికి పారదర్శకత పర్య వేక్షణకొరవడి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నది. అమెరికా లాంటి దేశాల్లో ఆరోగ్యవ్యయంలో ఎనభైశాతంపైగా ప్రభు త్వాలే వెచ్చిస్తుండగా మనదేశంలో ముప్ఫైకి మించడం లేదు.

థాయిలాండ్‌,క్యూబా లాంటిదేశాలు తమ దేశంలోని పౌరులందరికి ఆరోగ్యసేవలు అందించేస్థాయికి చేరుకున్నా యి. నాణ్యమైన ఆరోగ్యసేవలు పొందడానికి పౌరులకు రా జ్యాంగబద్ధమైన హక్కుగా తీర్మానం చేస్తూ థాయిలాండ్‌ ఏకంగా ఒక చట్టాన్ని రూపొందించింది. అన్నిటికంటే ము ఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల విస్తరణకు థా§్‌ుప్రభుత్వం భారీగా వెచ్చిస్తున్నది. అభివృద్ధిచెందుతున్న అన్నిదేశాలు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. అవసరం మేరకు నిధులు కేటాయిస్తున్నాయి. కానీ భారత్‌ లో ఆ పరిస్థితి కన్పించడంలేదు.ప్రజారోగ్యరంగంపై వ్యయా న్ని కనీసం రెండుశాతం కన్నా పెంచుతామని ఎప్పటి నుంచో చెప్తున్నా అవి కార్యరూపం దాల్చలేదు.

ప్రతిజిల్లా కేంద్రంలోనూ ప్రభుత్వ ఆస్పత్రిని నాణ్యమైన సదుపాయాల తో ఆధునీకరిస్తామని చేసిన వాగ్దానాలు కూడా మాటలుగానే మిగిలిపోయాయి. దీనికితోడు నకిలీ మందులు మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్నాయి. రకరకాల పద్ధతులతో తయారు చేస్తున్నారు. అధికారికంగా మనదేశంలోని ఇరవైవేల పైగా మందులు నమోదై ఉంటే అందుకు రెట్టింపు స్థాయిలో రకరకాల మందులు చెలామణి అవ్ఞతున్నాయి.ఔషధµ ని యంత్రణ విధానం రూపొందించడంలోనూ అమలుచేయ డంలోనూ పాలకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు శాపం గా మారుతున్నది. ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్న ఈ నకిలీ మందులు మార్కెట్లోకి ఒక వ్యూహం ప్రకారం ప్రవేశపెడుతు న్నారు.

ఏదిఏమైనా ప్రజారోగ్యాన్ని అందరూ కలిసి పతనం అంచుకు తీసుకుపోతున్నారేమోననిపిస్తున్నది. ఇప్పటి కైనా కేంద్ర,రాష్ట్ర పాలకులు ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలి. ప్రజారోగ్యసంరక్షణ బాధ్యత తమపై రాజ్యాంగం పెట్టిందనే విషయాన్ని పాలకులు ఎప్పుడూ విస్మరించరాదు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌