ప్రమాణ స్వీకారానికి హాజరు కాని ఎమ్మెల్యేలు

sandra venkata veeraiah, raja singh
sandra venkata veeraiah, raja singh

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ముగిశాయి. ఐనా కాని నూతనంగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా నేటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నగరంలోని గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఈ ఇరువురు నేటి సభా సమావేశాలకు హాజరుకాలేదు. సర్పంచ్‌ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్‌ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.