ప్రభువుకే మహిమ కలగాలి

jesus
jesus

ప్రభువుకే మహిమ కలగాలి

మనం ప్రభువు కోసం ఏంచేసినా అది తక్కువే అవ్ఞతుంది. కొందరు తమ సేవ విస్తరిస్తున్నకొద్దీ ఇది దేవ్ఞడు తమను ఆశీర్వదిస్తున్నాడని అనుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక సేవ విస్తరిస్తుంది అంటే ఆ సేవపై దేవ్ఞడి సాయం, ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. అలాగని ఆ సేవను బట్టి అతిశయించకూడదు. ‘మా చర్చికి ఇన్ని వేలమంది వస్తారు, మాద్వారా దేవ్ఞడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అంటూ ప్రకటనల్ని గుప్పించేవారు తక్కువేమీ లేరు. యేసుప్రభువ్ఞ 30 సంవత్సరాలు ఏవిధంగా జీవించాడో మనకు తెలియదు. కేవలం చివరి మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన సేవను గురించి మనకు తెలుసు. సరే, యేసుప్రభువ్ఞ 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం పొందాడు. ‘యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవ్ఞని ఆత్మ పావ్ఞరమువలె దిగి తనవిూదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను (మత్తయి 3:16,17). తండ్రి అయిన దేవ్ఞడు ప్రభువ్ఞ గురించి ఈ మాట చెబుతున్నప్పుడు యేసుప్రభువు ఎలాంటి సేవ చేయలేదు. అద్భుతాలు అంతకన్నా చేయలేదు. మరణించిన వారిని బ్రతికించలేదు. మరెందుకు దేవ్ఞడు తన కుమారుడి గురించి, ‘ఈయనయందు నేనానందించుచున్నాను అని చెప్పాడు.

కారణం ప్రభువు ప్రతి విషయంలో దేవ్ఞడిపై ఆధారపడ్డాడు. తండ్రి చిత్తం ప్రకారమే జీవించాడు. పరిచర్య చేశాడు. అందుకే ప్రభువ్ఞ మరణిస్తున్న సమయంలో ‘సమప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను (యోహాను 19:30). ఇక్కడ సమప్తమైందని ప్రభువ్ఞ ఎందుకు చెప్పాడు. మన పాపాన్ని నూటికి నూరుశాతం క్షమించాడు. ఇందులో సందేహం లేదు. కానీ దీనిగురించి ప్రభువ్ఞ చెప్పలేదు. ఆయన సమప్తమైంది అని అన్నాడు అంటే ఆ మాటకు అర్థం తండ్రి చిత్తాన్ని నూటికి నూరుశాతం పూర్తి చేశాడు అని అర్థం. ఆయన ప్రతి అడుగు, ప్రతి పని తండ్రి చిత్తం ప్రకారమే చేశాడు. తన పేరుకోసం, ఘనత కోసం చేయలేదు. ప్రభువ్ఞ ప్రతి అడుగులో కనికరాన్ని, ప్రేమను, క్షమాను చూపించాడు. ఇది మనలో కూడా ప్రవహించాలి. ఇంత చేసిన దేవ్ఞడికి మనం చేస్తున్న పని స్వల్పమైనది మాత్రమే. సరే సేవ విషయానికి వస్తే, అది దేవ్ఞడి ఆజ్ఞానుసారంగా, దేవ్ఞడిపై ఆధారపడి చేసేదిగా ఉండాలి. యేసుక్రీస్తు బండ. ఆ బండపై కట్టబడ్డ కట్టడం నిలుస్తుంది. ఇసుకపై కట్టిన కట్టడం గాలి వస్తే కూలిపోతుంది. బండ అనే ప్రభువ్ఞపై నిర్మించిన పరిచర్య ఏదైనా అది నిలవడమే కాదు, దేవ్ఞడు ఆ సేవ వల్ల మహిమ పొందుతాడు. ఇలాంటి పరిచర్య రానురాను క్షీణిస్తున్నది. దేవ్ఞడి పరిచర్య అంటూ కొందరు తమ పేరు గొప్ప చేసుకుంటున్నారు. విస్తారంగా డబ్బును సంపాదించుకుం టున్నారు. గొప్పగొప్పగా ప్రకటనల్ని గుప్పించుకుంటున్నారు. మనకు దేవ్ఞడి వాక్యం ఆధారం. ప్రభువ్ఞ కాని, ఆయన శిష్యులు కాని, డబ్బుకోసం, పేరుకోసం సేవ చేయలేదు. వారి ఆశ, ఆశయం, లక్ష్యం, గురి అన్ని దేవ్ఞడి రాజ్యవ్యాప్తి కోసమే తపించారు. మనస్ఫూర్తిగా సేవ చేసి, దేవ్ఞడిని మహిమపరిచారు. కాబట్టి మనం పేరు కోసం, డబ్బుకోసం కాక దేవ్ఞడి రాజ్యవ్యాప్తి కోసం నిజంగా పరితపించేవారంగా ఉందాం. ఇది దేవ్ఞడి చిత్తం. మనం ఏది చేసినా, దేవ్ఞడిని మహిమపరిచేందుకు మాత్రమే ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.

– పి.వాణీపుష్ప