ప్రభుదేవా గుండెపై హన్సిక టాటూ

Prabhudeva , Hansika
Prabhudeva , Hansika

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా ఎలాంటి కళాకారుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన స్పూర్తితో ఎంతో మంది డ్యాన్సర్లు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి సత్తాని చాటుతున్నారు.
నయనతారతో ప్రేమ వ్యవహారం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే హన్సికతో కూడా ప్రేమ వ్యవహారం నడిపినట్టు అనేక రూమర్స్ వచ్చినా తొందరగానే వాటికీ కౌంటర్ ఇచ్చారు. కానీ రీసెంట్ గా హన్సిక పోస్ట్ చేసిన ఒక ఫొటోని చూసి నెటిజన్స్ ఓ రకమైన రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఫొటోలో హన్సిక ప్రభుదేవా గుండెపై ఉన్న తన ఆకృతిలో ఉన్న టాటూని చూపిస్తోంది.
దీంతో సోషల్ మీడియాలో ఎవరికీ వారు వారి స్టైల్ లో నిజమే కదా అని కామెంట్స్ చేస్తున్నారు.