ప్రభుత్వ భవనాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధిస్తాం

RSS
RSS

ఎంపి కాంగ్రెస్‌మేనిఫెస్టోలో కీలకఅంశం
భోపాల్‌: కాంగ్రెస అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాల్లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలను నిషేధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పార్టీలన్ని ఎన్నికలకోసం తమతమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. కాంగ్రెస్పరంగాచూస్తే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ భవనాల్లో తిష్టవేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలను నిషేధిస్తామన్న అజెండాతో ముందుకువచ్చింది. అయితే బిజెపి పరంగా ఇందుకు మరింత తీవ్రంగా స్పందించింది. 1981లో నిషేధం మొట్టమొదటి కాంగ్రెస్‌ పార్టీయే విధించిందని, తర్వాత 2000వ సంవత్సరంలో పునరుద్ధరించారని, ముఖ్యమంత్రి దిగ్విజ§్‌ుసింగ్‌ హయాంలోనే పునరుద్ధరణ జరిగిందని అన్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌శాఖలకు హాజరవుతున్న ఉద్యోగులకు మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీచేసారు. ఎంసి సివిల్‌ సర్వీస్‌ వర్గీకరణ,నియంత్రణ, అప్పీళ్లు నిబంధనలు 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసారు. 2006లో శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఉద్యోగులుసైతం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని మినహాయింపులిచ్చింది. రాష్ట్ర చీఫ్‌ కమల్‌నాధ్‌, జ్యోతిరాదిత్యసింధియా, దిగ్విజి§్‌ుసింగ్‌ మరికొందరు పార్టీ మేనిఫెస్టోను గత శనివారం విడుదలచేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ వైఖరిని కమల్‌నాధ్‌ సమర్ధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకు వెళ్లేందుకే ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని, దీనివల్ల ప్రభుత్వ విధులపై శ్రద్ధ ఉండదని అన్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం సైతం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నిర్ణయం సముచితమేనని సమర్ధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ సంస్థ అని కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలో అధికారంలోనికి వస్తే వెంటనే ముగింపుచెపుతామని, ఇందులో తప్పు ఏముందని ప్రశ్నించారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేస్తున్నంతకాలం ఎలాంటి రాజకీయ పార్టీతోను సంబంధం పెంచుకోకూడదన్న నిబందనలున్నాయని కాంగ్రెస్‌నేతలు చెపుతున్నారు.రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాకేష్‌ సింగ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌నిషేధం ఎంతమాత్రం పనిచేయదని, ఒక దేశభక్తి ఉన్న సంస్థ తన కార్యకలాపాలు దేశం కోసమే పనిచేస్తుండగా ఈచర్యలు చెల్లవని అన్నారు. అలాగే వ్యక్తిత్వ నిర్మాణంపైనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కువ కృషిచేస్తుందన్నారు.