ప్రభుత్వ అవినీతినిప్రజల్లోకి…

CWC
CWC

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని,ప్రత్యేకించి అవినీతి భాగోతాలను ప్రజలయు వివరించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పెద్దలు నిర్ణయించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, ఎకె ఆంటోని, గులామ్‌నబీ ఆజాద్‌, మల్లిఖార్జున్‌ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ గెహ్లట్‌ వంటి సీనియర్లు హాజరైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్షత వహించారు. బ్యాంకుల్లో కుంభకోణాలు, రాఫెల్‌డీల్‌ వంటి వాటిని ఎత్తిచూపించడంతోపాటు దేశ ఆర్ధికవ్యవస్థ అధ్వాన్నస్థితినిసైతం వివరించి ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతాపార్టీని ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. అలాగే అస్సాం జాతీయ పౌరనివేదికపై కూడా కాంగ్రెస్‌ సీనియర్లు కలవరం వ్యక్తంచేసారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలనిసైతం నిర్ణయించారు. మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మాత్రం ఈసమావేశానికి హాజరుకాలేదు. ఎఐసిసి అధ్యక్షుని హోదాలో రాహుల్‌గాంధీ నాయకత్వంలో రెండో సమావేశం జరిగింది. రాఫెల్‌ దోపిడీకి సంబంధించి మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోని చేసిన వివరణాత్మక నివేదిక సమావేశంలో సుదీర్ఘచర్చకు తావిచ్చింది. రూ.1.30 లక్షలకోట్లు ఖజానాకు భారం అయిందని, ప్రజలనుంచి తస్కరించిన ఈసొమ్ములో రూ.45వేల కోట్లు మోడీ ఆయన మిత్రునికి రుణంగా ఇచ్చారని రక్షణమంత్రి వివరించారు. అవినీతికిసంబంధించి జరిగిన అన్ని కోణాలనుంచి మోడీ ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలదీయాలని నిర్ణయించారు. కాంగ్రెస అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ సమావేశం అనంతరం జన్‌ ఆందోళన్‌ పేరిట పార్టీ విస్తృత ఆందోళనలకు నిర్ణయించినట్లు వివరించారు. రానున్నరోజుల్లోనే రాష్ట్ర పార్టీ యూనిట్లను చర్చించి కార్యాచరణప్రణాళిక నిర్దేశిస్తామని వివరించారు. సమావేశంలో ప్రస్తుతం దేశంలోని రాజకీయ స్థితిపై చర్చించడంజరిగిందని, వినీతి,ప్రభుఎత్వ వైఫల్యాలు,యువతకు ఉపాధి కల్పించడంలోమోడీ వైఫల్యం వంటి వాటిని ఎక్కువ ప్రజల్లోనికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంతేకాకుండా పంజాబ్‌నేషనల్‌ బ్యాంకులో కీలక కుంభకోణం సూత్రధారి వజ్రాలవ్యాపారి మెహుల్‌చోక్సీకి పాస్‌పోర్టుజారీచేయడంతోపాటు ముంబయి అధికారులు అన్ని అనుమతులు ఇవ్వడాన్ని కూడా నిలదీయాలని నిర్ణయించారు. కరీబియన్‌ దేశం యాంటిగాంవకు భారత్‌ స్వయంగా అనుమతులు ఇవ్వడంపై పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాపారి పరారీకి పరోక్షంగా ప్రభుత్వమే సహరించిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాఫెల్‌డీల్‌పై సూర్జేవాలా మాట్లాడుతూ ప్రధాన ంమరతి లేదా రక్షణమంత్రి ఈ జెట్‌ కొనుగోళ్ల ధరలను వెల్లడించడంలేదని,యుపిఎ హయాంలో ఒక్కొక్క విమానం రూ.526 కోట్లకు నిర్ణయిస్తే ప్రస్తుత మోడీ ప్రభుత్వం రూ.1676 కోట్లుగా నిర్ణయించిందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.48వేల కోట్లు భారం పడుతోందన్నారు. అస్సాంలోచేపట్టిన ఎన్‌ఆర్‌సి రిజిష్టరుపై సూర్జేవాలా మాట్లాడుతూ 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అస్పాసం ఒప్పందంపై సంతకం చేసిన దరిమిలా ఈ జాతీయ పౌరనివేదిక ఆవిర్భవించిందని అన్నారు. పార్టీ పరంగా ఏ ఒక్క పౌరుడి చిరునామా ఈ జాబితానుంచి తప్పించుకునేందుకు వీలులేకుండా కృషిచేస్తుందని అన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌సి కాంగ్రెస్‌ పుత్రిక అని ఆయన పేర్కొన్నారు. ప్రతి భారతీయపౌరుడు ఈ పౌరపత్రంలో నమోదు అయ్యేందుకు హక్కులు కలిగి ఉన్నాడన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యుపిఎ ప్రభుత్వం 2005 నుంచి 2013వరకఊ మొత్తం 82,728 విదేశీయులను ప్రత్యేకించి బంగ్లాదేశీయులను అప్పగించిందని, ఎన్‌డిఎప్రభుత్వం కేవలం 1822 మంది విదేశీయులను మాత్రమే గడచిననాలుగేళ్లలో గుర్తించిందన్నారు. ఈ గణాంకాలుమోడీప్రభుత్వం పార్లమెంటులోప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తుచేసారు. ప్రతి భారతీయ పౌరునికి న్యాయం జరగాలని, విదేశీయులను తక్షణమే గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.