ఏ రాజకీయ పార్టీ జెండానూ మోయొద్దు: హైకోర్టు

High Court
High Court

ఎన్నికల్లో పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులెవరూ పార్టీల జెండా మోయడానికి వీల్లేదని గురువారం ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. ఏ రాజకీయ పార్టీకీ కొమ్ముకాయకూడదని, నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించింది. పోలింగ్‌ కేంద్రాల్లోకి అభ్యర్థి, పోలింగ్‌ ఏజెంట్‌ తప్ప ఇతరులెవ్వరినీ అనుమతించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌(ఎంబీటీ) అధ్యక్షుడు మజీదుల్లాఖాన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.