ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు

Mallu Ravi
Mallu Ravi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి
హైదరాబాద్‌: తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడంతో ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు కట్‌ అవడం బాధాకరమని పేర్కొన్నారు. దీనిపై ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారని చెప్పారు. మంత్రివర్గం లేకపోవడం వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేక పోతున్నారనీ, సీఎం కేసీఆర్‌ ఈ పరిస్థితిని చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు సీఎంను కలిసే పరిస్థితి లేదనీ, చాలా శాఖల్లో ఇదేరకమైన గందరగోళం నెలకొని ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సుప్రీం తీర్పుతో రాజ్యాంగ సంక్షోభం ఆగిందనీ, కలకత్తా సీపీపై సుప్రీంకు ముందే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకునే విధంగా పనిచేయాలనీ, కేవలం రాజకీయ లబ్ది కోసమే కలకత్తా సిపిని అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. దేశం ఫెడరల్‌ స్ఫూర్తితో ఏర్పడిందనీ, ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ రాజుల్లాగా పరిపాలిస్తున్నారనీ, ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కోల్‌కతా సీపీ అరెస్టు వ్యవహారంలో సుప్రీం తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈడీ, సీబీఐ లాంటి అన్ని రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం బలహీనం చేసిందని ఆరోపించారు.
్ౖఠ్ణ్త్ౖలకాంగ్రెస్‌ చరిత్రను వక్రీకరిస్తే నిరసన తప్పదు : మానవతారా§్‌ు
వైఎస్సార్‌పై తీస్తున్న సినిమాను పీసీసీ ప్రసిడెంట్లకు చూపించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి మానవతారా§్‌ు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ చరిత్రను వక్రీకరిస్తే తెలంగాణలో నిరసన తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌ పార్టీ నేతలే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందాలన్న కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌ చివరి వరకు కాంగ్రెస్‌ నేతగానే ఉన్నారనీ, అలాంటి మహానేత జీవిత చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి విజయశాంతి పోటీచేస్తే స్వాగతిస్తామనీ, అక్కడి నుంచి చాలా సార్లు తనకు అవకాశం ఇస్తే వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.