ప్రభుత్వరంగ బ్యాంకుల 54 విదేశీ శాఖలు మూసివేత

SBI
SBI

పార్లమెంటుకు ఆర్ధికశాఖ నివేదిక
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు వివిదదేశాల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను క్రమబద్దీకరించాలనినిర్ణయించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు గత ఏడాది జనవరినాటికిచూస్తే మొత్తం 165 శాఖలు పనిచేస్తున్నాయి. కొన్ని అనుబంద శాఖలు,జాయింట్‌వెంచర్లు, ప్రతినిది కార్యాలయాలు కూడా విదేశాల్లో పనిచేస్తున్నాయి. గత ఏడాదినాటికే ఈ బ్యాంకులు కొన్ని శాఖలను కుదించడం, లేదా నిలిపివేయడం వంటి కార్యాచరణకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి పియూష్‌గోయల్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ధికశాఖప ఆర్లమెంటుకు నివేదిక ఇస్తూ సుమారు 54 విదేశీ కార్యకలాపాలను క్రమబద్దీకరణకు ఎంపికచేసామని, వాటిలో 29 శాఖలను ఇప్పటికే క్రమబద్దీకరించి వ్యయాన్ని తగ్గించినట్లు వెల్లడించింది. వ్యయాన్ని తగ్గించడం, నిర్వహణభారం కుదించుకునే లక్ష్యంతో కొన్ని విదేశీ శాఖలను కుదిస్తున్నట్లు ఆర్ధికశాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్‌శుక్లావెల్లడించారు. సంస్కరణ అజెండాతో కొన్ని సిఫారసులను కూడా స్వీకరించామని, పూర్తికాలపు డైరెక్టర్లు సీనియర్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లనుంచి నివేదికలు తీసుకున్న తర్వాతనే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సంస్కరణలపరంగా చూస్తే విదేశీ కార్యకలాపాల క్రమబద్దీకరించడం, వ్యయ సామర్ధ్యం పెంచుకోవడం వంటి చర్యలను చేపట్టినట్లు ఆర్ధిక మంత్రి వివరించారు. భారతీయ స్టేట్‌బ్యాంకు ఎక్కువసంఖ్యలో విదేశీశాఖలు కలిగి ఉంది. 52శాఖలుపనిచేస్తున్నాయి. తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు 50, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 29శాఖలున్నట్లు మంత్రి వివరించారు. బ్రిటన్‌లో 32శాఖలు,హాంకాంగ్‌లోను, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోను 13 చొప్పున ఉన్నాయి. సింగపూర్‌లో 12 భారత శాఖలున్నాయి. 2016-17 ఆర్ధికసంవత్సరంలో 41శాఖలు నష్టాల్లోనే కొనసాగినట్లు తేలింది. ఎస్‌బిఐ పరంగాచూస్తే తొమ్మిది విదేశీశాఖలు నష్టాల్లో ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎనిమిది, ఏడుశాఖలు నష్టాల్లో ఉన్నాయని వెల్లడించింది. బ్యాంకింగ్‌రంగ అజెండాను ప్రభుత్వరంగ బ్యాంకుల మంథన్‌పేరిట2017 నవంబరులోనిర్వహించిన సదస్సులోనే అజెండాను ఆమోదించి విదేశీ శాఖల క్రమబద్దీకరణను ఆమోదించింది. ఇక ఎటిఎం మోసాలకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం అందుబాటులోలేదని, రాస్ట్రాలవారీగా గణాంకాలుమొత్తం లక్ష ఆపైబడిన మోసాలు గడచినమూడేళ్ల కాలంలో జరిగినవి మాత్రమే ఉన్నాయన్నారు. 2017-18 సంవతసరంలో 911 ఆటోమేటెడ్‌టెల్లర్‌మెషిన్‌మోసాలు జరిగాయని, 2016-17లో మొత్తం 724 కేసులు నమోదయ్యాయని, 2015-16లో 563 ఇలాంటి కేసులే నమోదయినట్లు వెల్లడించారు. ఈ మొత్తాలు లక్ష ఆపైబడినమొత్తాలే చోరీజరగడం, లేదా మోసాలు జరగడం వంటి సంభవించినట్లు వెల్లడించారు.