ప్రభుత్వనికి రాందేవ్‌ బాబా సూచన

Baba Ramdev
Baba Ramdev

చండీగఢ్‌: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ప్రభుత్వానికి సంచలన సూచన ఇచ్చారు.బుధవారం చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడుతు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఓటు హక్కును తొలగించాలని అన్నారు.  అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటి వాటిని తొలగిస్తేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. హిందూ, ముస్లిం భేదాలు లేకుండా ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఇది తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.