ప్రభుత్వ మోడల్‌ హై స్కూల్‌ను సందర్శించిన మంత్రి

మహబూబాబాద్‌: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా పర్యటనలో భాగంగా తొర్రూరు మండలం గుర్తూరు ప్రభుత్వ మోడల్ హై స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో సీటింగ్ అరెంజ్‌మెంట్స్‌ ఇతర వసతులు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిది, పదో తరగతి విద్యా బోధన జరుగుతున్న తీరుని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సునీతని అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో ఇంకా ఏయే అవసరాలు ఉన్నాయంటూ మంత్రి ఆరా తీశారు. వంట కోసం ఒక షెడ్ కావాలని అడగడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి షెడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక నేతలు ఉన్నారు.