ప్రభుత్వం కొద్ది మంది గుత్తేదారుల కోసమే పనిచేస్తుంది: కోదండరాం

Kodandaram-1
Kodandaram

హైదరాబాద్‌: ఉద్యోగాల ఖాళీల సంఖ్యపై ప్రభుత్వం రోజుకో మాటా చెబుతుందని టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీచేసే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే ఎందుకు కాల పట్టికను ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కొద్దిమంది గుత్తేదారుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. డిసెంబర్‌ 4న సరూర్‌నగర్‌లో కొలువులకై కొట్లాట సభను వినూత్నంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, సోమవారం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు సభ నిర్వహిస్తామని తెలిపారు. సభా ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణం గానూ, సభా వేదికకు శ్రీకాంతాచారి వేదికగా నామకరణం చేశామని, ఈ సభకు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలను ఆహ్వానించినట్లు కోదండరాం తెలిపారు.