ప్రభుత్వంలో అవినీతి ఆయనకు తెలుసు

PAWAN KALYAN-2

తెదేపా ప్రభుత్వంపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. తాను అకస్మాత్తుగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంలేదని, గత నాలుగేళ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు ఈ సమస్యను ఏనాడూ తీవ్రంగా తీసుకోలే దన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఆయనకు తెలుసు నని అన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం లో అవినీతి జరుగుతున్నట్లు తనకు చెప్పారని, తాను ముఖ్య మంత్రికి సమస్యను వివరించాలని వారు భావించారని, తాను అదే చేశాన న్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించడం వెనుక కూడా ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.