ప్రభాస్ సరసన అందమైన అమ్మాయి కోసం

Shradha
Shradha

ప్రభాస్ సరసన అందమైన అమ్మాయి కోసం జల్లెడ పట్టింది సాహో టీమ్. వారికి వెతుకులాటకు సమాధానంలా దొరికింది శ్రద్ధా. ఈ సినిమా తెలుగు… హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అంతే శ్రద్దా తెలుగు అరంగేట్రం… ప్రభాస్ హిందీ అరంగేట్రం సాహోతోనే. తన తొలి తెలుగు సినిమాను బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తో చేయడం ఆమె కూడా గౌరవంగానే భావిస్తోంది. అంతేకాదు తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు తెలుగులో స్టార్హీరోయిన్లంతా పాత వాళ్లయిపోయారు. రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ఉన్నా… ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా లేదు. ఇప్పుడు కొత్త హీరోయిన్ల అవసరం తెలుగు పరిశ్రమకు ఎంతైనా అవసరం. ఆ లోటును శ్రద్ధా భర్తీచేసేలా ఉంది. ప్రభాస్తో సినిమా పూర్తయ్యాక… మరో స్టార్ హీరోతో నటించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఆమె కోరుకున్న విధంగానే అందుతుండడంతో తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉందట శ్రద్ధా.

త్రివిక్రమ్…జూనియర్ ఎన్టీఆర్  కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో శ్రద్ధాకు అవకాశం వచ్చినట్టు సమాచారం. అయితే శ్రద్ధానే అవకాశాన్ని కాదునుకుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో పక్కన నటించబోతున్నట్టు తెలుస్తోంది.