ప్రభాస్‌ కార్‌ ఛేజ్‌ కోసం భారీ ఖర్చు!

PRABHAS
PRABHAS

ప్రభాస్‌ కార్‌ ఛేజ్‌ కోసం భారీ ఖర్చు!

ప్రభాస్‌ తదుపరి సినిమా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌ లో వుంటాయని చెబుతున్నారు. ఇందుకోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కొనసాగే కారు ఛేజ్‌ సీన్‌ ఒకటి ఉందట. ఆడియన్స్‌ ను కట్టిపడేసేలా ఈ సీన్‌ ఉంటుందని అంటున్నారు. ఈ ఒక్క ఛేజ్‌ సీన్‌ కి దాదాపు 35 కోట్లను కేటాయించారనేది టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ప్రభాస్‌ కెరియర్లో మరో భారీ సినిమా అవుతుందని అంటున్నారు.