ప్రభాస్‌ అభిమానులకు డబుల్‌ బొనాంజా!

Prabhas1
Prabhas

ప్రభాస్‌ అభిమానులకు డబుల్‌ బొనాంజా!

రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన బాహుబలి ఇప్పటికి ఎప్పటికి భారతీయ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు బాహుబలి రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులని పరిచయం చేసింది. బాహుబలి చిత్రం కోసం ఆయన చూపిన అంకితభావం, బాహుబలిగా ఆయన ప్రదర్శించిన నటన, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవటంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఇదిలా ఉంటే అటు అభిమానులు, సినీ వర్గాలు.. ఇటు సాధారణ ప్రేక్షకులు, మీడియా వర్గాల్లో ప్రభాస్‌ నటిస్తున్న తదుపరి చిత్రం టైటిల్‌ పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాల బాహుబలి తర్వాత వచ్చే చిత్రం కావడంతో అసలు ఏ టైటిల్‌ పెట్టారనే క్యూరియాసిటీతో ప్రపంచవ్యాప్త ప్రభాస్‌ అభిమానులు, భారతీయ సినీ ప్రేక్షకులు గూగుల్‌ లో సెర్చ్‌ చేయటం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. భారతీయ సినీ జగత్తు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌-సుజిత్‌-యువి క్రియేషన్స్‌ భారీ చిత్రానికి సాహో అనే టైటిల్‌ ను ఖరారు చేశాం. ఈ హైటెక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నాం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్‌ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. బాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ త్రయం శంకర్‌ -ఎహసాన్‌-లా§్‌ు ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

హిందీ లిరిక్స్‌ ను… అమితాబ్‌ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మధి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరీల్‌ లాంటి టాప్‌ టెక్నీషియన్స్‌ సాహో చిత్రానికి వర్క్‌ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్‌ స్టైలిష్‌ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న సాహో చిత్ర ఫస్ట్‌ లుక్‌ అఫీషియల్‌ టీజర్‌ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రంతో పాటు ప్రదర్శించనున్నాం. సో… ఏప్రిల్‌ 28వ తేది ప్రభాస్‌ అభిమానులకు డబుల్‌ బొనాంజా అనే చెప్పాలి. సాహో స్టైలిష్‌ యాక్షన్‌ టీజర్‌ ను పెద్ద తెర పై చూసి ఆస్వాదించండి. అన్ని హంగులతో భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ‘సాహో దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తుంది అని ఆశిస్తున్నాం అని అన్నారు.