ప్రభాత్‌ డైయిరీ లాక్టాలిస్‌ పరం!

prabhat dairy
prabhat dairy

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ప్రభాత్‌డైయిరీ తన మొత్తం పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని ఫ్రెంచ్‌ కంపెనీ గ్రూప్‌ లాక్టాలిస్‌కు రూ.1700 కోట్లకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీనితో ఒక్కసారిగా కంపెనీ షేర్లు బహుముఖంగాపెరిగాయి. ఆగస్టు 23వ తేదీనుంచి జరిగిన లావాదేవీలపరంగాచూస్తే ఇంట్రాడేలో 20శాతంపెరిగి 111.3రూపాయలకు చేరింది. కంపెనీ తన సన్‌ఫ్రెష్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తిరుమల మిల్క్‌ప్రొడక్ట్సుకు విక్రయిస్తుంది. ఈ ంకపెనీ భారత్‌లోని లాక్టాలిస్‌కు అనుబంధంగా పనిచేస్తుంది. ఆ తర్వాత డెయిరీ ఉత్పత్తులను సన్‌ఫ్రెష్‌కు స్లంప్‌సేల్‌ విధానంలో బదిలీచేస్తుంది. ఈ విక్రయాల్లో కొంతమొత్తం వాటాదారులకు కేటాయిస్తుంది. అయితే ముందు పన్నులు, లావాదేవీల ఖర్చులన్ని పూర్తిచేసిన తర్వాత జరుగుతుంది. ఈ డీల్‌ అనంతరం తన పశుగ్రాసం వ్యాపారాన్ని దాణా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తుందని అంచనా. పశుపోషక ఉత్పత్తులు, పశు ఔషధాలవైపు కూడా దృష్టిసారిస్తుందని అంచనా. గత ఏడాది నవంబరు నుంచి ప్రభాత్‌ డెయిరీ అమ్మకాలు భారీగాపెరిగాయి. షేర్లుసైతం గరిష్టస్థాయికి చేరాయి. సుమారు 3.3 మిలియన్ల వాటాలను చేతులుమారాయి. 30రనోజుల సగటున 83,326 షేర్లు కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం కంపెనీ స్టాక్‌ 2.5శాతం ఈ ఏడాదిపెరిగిందని అంచనా.