ప్రపంచ రికార్డుకు చేరువలో నిలిచిన రషీద్‌ ఖాన్‌

RASHID1
RASHID1

ప్రపంచ రికార్డుకు చేరువలో నిలిచిన రషీద్‌ ఖాన్‌

ఆప్గనిస్తాన్‌: ఆప్గనిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ప్రపంచ రికార్డుకు వికెట్‌ దూరంలో నిలిచాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 43 వన్డేలాడిన రషీద్‌ ఖాన్‌ 99 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వికెట్‌ కనుక తీస్తే వన్డేల్లో అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.జింబాబ్వేలోని హరారే వేదికగా జరుగుతోన్న ఐసిసి ప్రపంచకప్‌ క్వాలిఫయిర్‌ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ఖాన్‌ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తద్వారా 99 వికెట్లతో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ను సమీపించాడు. స్టార్క్‌ 52 వన్డేల్లో వంద వికెట్లు తీశాడు. దీంతో ఇప్పటివరకు వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన రికార్డు మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉంది. రషీద్‌ ఖాన్‌ మరో వికెట్‌ తీస్తే 44 వన్డేల్లోనే ఆ ఘనత సాధించిన బౌలర్‌గా మిచెల్‌ స్టార్క్‌ను రషీద్‌ ఖాన్‌ అధిగమిస్తాడు. ప్రపంచకప్‌ క్వాలిఫయిర్‌ టోర్నీలో భాగంగా వెస్టిం డీస్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.