ప్రపంచ బ్యాంకు ఎండిగా అరుంధతీ భట్టాచార్య?

ARUNDATIRAI15
ARUNDATIRAI15

ప్రపంచ బ్యాంకు ఎండిగా అరుంధతీ భట్టాచార్య?

ముంబై, అక్టోబరు 14 : భారతీయ స్టేట్‌బ్యాంకు ఛైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య ప్రపంచ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారిగా నియమితులవుతున్నారన్న వార్తలు వెలుగులోనికి వచ్చాయి. అయితే ఈ నియామకానికి అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్యాంకులో ఓటింగ్‌శాతం ఎక్కువ ఉన్న దేశం సమర్ధించాల్సి ఉంటుంది. ఈ నియామకం అంత సునా యాసం ఏమీ కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టర్లు ఈ నియామకం ముందు ధృవీ కరించాల్సిఉంటుంది. వీరం తా వివిధ దేశాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్నవారై ఉం టారు. ప్రపంచ వ్యాప్తంగా 189 సభ్యదేశాల ప్రనతినిధులతో గవర్నర్ల బోర్డు రూపొందుతుంది. బ్యాంకు విధివిధానాల నిర్ణాయక మండలిగా గవ ర్నర్‌ల బోర్డు వ్యవహరిస్తుంది. ఏడాదికి ఒకపర్యా యం మాత్రమే ఈ బోర్డు సమావేశం వుతుం ది. గవర్నర్ల బోర్డు 24 మంది డైరెక్టర్ల బోర్డును ఎన్ను కుంటుంది. వీరినే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా పిలు స్తారు. ఈ డైరెక్టర్లబోర్డు రెండువారాలకోసారి సమా వేశం అవుతుంది. భారత్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాల ప్రతినిధిగా ముఖేష్‌ నందన్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ బ్యాంకు రుణపరపతిని అందిస్తుంది. ప్రపంచ బ్యాంకులో భారత్‌కు రెండుశాతం మాత్ర మే ఓటింగ్‌ వాటా ఉంది. అమెరికాకు 15శాతంగా ఉంది. అందువల్లనే అమెరికా మద్దతు భారత్‌కు ఎక్కువ అవసరం అవుతుంది. భారత ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు ప్రపంచ బ్యాంకుకు నాలు గేళ్లపాటు ముఖ్య ఆర్థికవేత్తగా 2012లో నియమితుయ్యా రు. అంతకుముందు అమె రికాకు చెందిన పాల్‌ రోమర్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ డిఫ్యూటీ ఛైర్మన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లూ వాలియా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు స్వతంత్ర నిర్ణాయక డైరెక్టర్‌గా నియమి తులయ్యారు. ఎండి, సిఒఒ పోస్టు గడచిన జూలై నుంచి ఖాళీగా ఉంది. ఇండోనేసియా ఆర్ధికవేత్త ముల్యాని ఇంద్రావతి తన దేశానికి తిరిగివెళ్లి ఆర్థిక మంత్రిగా బాద్యతలు స్వీకరించడం వల్ల ఆపోస్టు ఖాళీగానే ఉండిపోయింది. ప్రస్తుతం ఆపోస్టుకే ఎస్‌బిఐ భట్టాచార్య పేరు వినిపిస్తోంది.