ప్రపంచానికి ఐసిస్‌, రాష్ట్రానికి జగన్‌ ప్రమాదకరం: మంత్రి కొల్లు రవీంద్ర

AP Minister Kollu Ravindra
AP Minister Kollu Ravindra

విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో
మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో పొల్చారు.
ప్రపంచానికి ఐసిసి ప్రమాదకరమైతే రాష్ట్రానికి జగన్‌ ప్రమాదకరం అని అన్నారు. కులాల మధ్య
చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌కు నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి భయం కనిపిస్తుందని,
అందుకే నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం
పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.