ప్రపంచకప్‌ తర్వాత రిటైర్‌

Untitled-1 copy
Yuvaraj Singh

ప్రపంచకప్‌ తర్వాత రిటైర్‌

న్యూఢిల్లీ: టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలు అందించిన యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది జూన్‌లో చివరిసారిగా భారత్‌ తరుపున వన్డే క్రికెట్‌ ఆడిన యువీ…తిరిగి జట్టులోకి రాలేకపోతున్నాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడం కోసం యో-యో టెస్టులో పాసవ్వడం తప్పనిసరి చెప్పిన మేనే జ్‌మెంట్‌ తర్వాత ఆ టెస్టులో పాసైనా…యువీకి మాత్రం జట్టులో స్థానం కల్పించలేదు. దీంతో అతడి కెరీర్‌ డైలమాలో పడింది. భారత్‌ తరుపున ఆడే అవకాశం రాకపోవడంతో యువరాజ్‌ ఇక క్రికెట్‌ నుంచి రిటైరవ్వడం ఉత్తమం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని యువీ వద్ద ప్రస్తావించగా….వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు. గత 17ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నా. ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందే. వచ్చే ఏడాది వరకు ఆడుతా. అది ఏ స్థాయిలోనైనా కావచ్చు. తర్వాత రిటైర్మెంట్‌ గురించి ప్రకటిస్తానని యువీ తెలిపాడు. =====