ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు రద్దు చేయాలి

CRICKET
CRICKET

ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు రద్దు చేయాలి

ముంబయి : పుల్వామా దాడిని యావత్‌ భారత దేశ ప్రజలకు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈదాడిని ఖండిస్తూ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సామా జిక మాధ్యమాల వేదికగా తమ సందేశాలు పంపు తున్నారు. ఇక క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) అయితే ఈఘటనకు పాకిస్తాన్‌ను కారణంగా చూపుతూ ఇమ్రాన్‌ఖాన్‌చిత్రపటాలను ీఆల్‌రౌండర్‌ రెస్టారెంట్‌ నుంచి తొలగించింది. తాజాగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ల ప్రసారాన్ని కూడా బ్రాడ్‌కాస్టింగ్‌ అధికారులు నిలిపివేశారు. మరో కొన్ని నెలల్లో జరగనున్న ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో టీమిడియా మ్యాచ్‌ ఉండకుండా చూడాలని బిసిసిఐను సిసిఐ కోరింది. సిసిఐ సెక్రటరీ సురేశ్‌ బప్నా మాట్లాడుతూ…దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఇమ్రాన్‌ఖాన్‌ ముందుకు రాలేదు. దీనిపై ఆయన ఏమి మాట్లాడకుండా లేదంటే వాళ్లవైపు కొంత తప్పుందనే నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. మన జవాన్ల మీద జరిగిన దాడినిమేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సిసిఐ క్రీడా రంగానికి చెందినదే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈదాడిపై ఇమ్రాన్‌ఖాన్‌ ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయన పాకిస్తాన్‌ ప్రధాని.వాళ్లదేశం వైపు ఈ తప్పుకోలేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు. అందుకుఏ ప్రపంచకప్‌లో టీమిండియా…పాకిస్తాన్‌త ఆడకూడదు. ఈమేరకు ఇప్పటికే బిసిసిఐని కోరామని తెలిపారు. ప్రపంచకప్‌