ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నాం

 

Chandrababu
Chandrababu

అమరావతి: ఈరోజు సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేసిన తరువాత నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతు ఒకే రోజు రెండు ప్రధాన కార్యక్రమాలకు శ్రీకారం చూట్టామాన్నారు. సచివాలయంతో పాటు కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాన చేస్తున్నామని చెప్పారు. సచివాలయ భవానల శంకుస్థాపన కార్యక్రమం రాజధాని నిర్మాణంలో అత్యంత ప్రధానమైనదని సిఎం ఆయన తెలిపారు. అత్యంత ఆధునికత, సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరిపాలన భవనాలు నిర్మిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.