ప్రధాని సలహామండలి సభ్యుని రాజీనామా

surjit bhalla
surjit bhalla

న్యూఢిల్లీ: ప్రధాని ఆర్ధికసలహా మండలిసభ్యునిగా ఉన్న సుర్జిత్‌భల్లా తన సభ్యత్వంనుంచి వైదొలిగారు. ప్రధాని కార్యాలయం కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది. ఆయననిష్క్రమణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఆర్ధికవేత్త మీడియారంగంలో చేరాలని అనుకుంటున్నారని, అందువ్లనే రాజీనామాచేసినట్లు చెపుతున్నారు. ఇటీవలే ఒక ఆంగ్లపత్రికలో ఒక ఎన్నికల అంచనా వ్యాసం ప్రచురితం అయింది. భల్లా ఒక ఆంగ్లపత్రికకు ఎడిటర్‌గా రావచ్చని, నెట్‌వర్క్‌18 గ్రూప్‌లో కన్సలెంట్‌గా ఉంటున్నారు. తాత్కాలిక సభ్యునిగా ఈనెల ఒకటవ తేదీనుంచి ఆ పదవికి రాజీనామాచేస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లోపేర్కొన్నారు. ప్రిన్స్‌టన్‌ వర్సిటీనుంచి పిహెచ్‌డి పట్టా ఉన్న భల్లా అబ్సర్వేటరీగ్రూప్‌లో సీనియర్‌ వివ్లేషకులుగా పనిచేసారు. గత ఏడాది ఆయన పుస్తకం దేశాల కొత్త సంపద పుస్తకంలో ఆదాయవనరుల్లో అసమానత్వం వల్లనే విద్యరంగంలో ప్రపంచం వెనుకంజలో ఉందని చెప్పుకొచ్చారు. సిటిజన్‌రాజ్‌, ఇండియన్‌ ఎలక్షన్స్‌ 1952-2019 పేరిట పుస్తకాలుసైతం రాసారు.