ప్రధాని మోదీది బూటకపు పెన్షన్‌ పథకం:టి.నరసింహన్‌ ధ్వజం

PM MODI
PM MODI

సైఫాబాద్‌,  : పార్లమెంట్‌లో తాత్కాలిక ఆర్ధిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర తాత్కాలిక బడ్జెట్‌లో ‘ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌థన్‌ పేరుతో ప్రవేశపెట్టిన పెన్షన్‌ పథకం ఓట్టి భూటకమని, ఈ పథకం దేశంలోని 41 కోట్ల అసంఘటిత కార్మికులను మరింత దోచుకునే ప్రయత్నమని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టి.నరసింహన్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి కార్మికులను మభ్యపెట్ట ప్రకటనలు తప్ప ఇది మరొకటి కాదని, ఆర్ధిక శాఖ మంత్రి తన ప్రసంగంలో దేశ జిడిపి ఆధాయంలో సగం 42 కోట్ల మంది అసంఘటిత కార్మికుల నుంచి వస్తుందని, అందుకని వారికి న్యాయం చేయడానికి ఈ నూతన కాంట్రిబ్యూటరీ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని సెలవు ఇవ్వడం అశ్చర్యకరంగా ఉందని ఆయన ఎద్దేవచేశారు. ఒక వైపు దేశంలోని ఉద్యోగులు, కార్మికులకు 2004 నుంచి నూతన పెన్షన్‌ పేరుతో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కాంట్రిబ్యూషన్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తుంటే ఏలాంటి గ్యారంటిలేని రోజువారి కూలీచేసుకుని బ్రతికే రిక్షా కార్మికులు, చేనేత, తోలు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఇంటి పనివారల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ఇది అసాధ్యమని బుధవారం నాడిక్కడ పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన వారు నెలకు 55 రూపాయలు, 29 సంవత్సరాలు నిండిన వారు నెలకు వంద రూపాయలు, 40 సంవత్సరాలు ఉన్నవారు నెలకు రెండు వందల రూపాయలు కడితే ప్రభుత్వం ఆదే తరహలో కార్మికుల అకౌంట్‌లో జమ చేసి 60 సంవత్సరాలు నిండిన తరువాత మూడు వేల రూపాయలు పెన్షన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కాని ఈ పధకం 40 సంవత్సరాలు నిండిన వారికి వర్తించదన్నారు. ఒక కార్మికుడు నెలకు వంద రూపాయలు చోప్పున 40 సంవత్సరాలు జమ చేసిన సోమ్ము ఫిక్సెడ్‌ డిపాజిట్‌లో జమ చేస్తే నెలకు వచ్చే వడ్డీ మూడువేల కంటె ఎక్కువేనన్న ఇంకీత జ్ఞానం కూడా మోడీ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని నరసింహన్‌ నిశితంగా విమర్శించారు.