ప్రధాని మోడీకి అసదుద్దీన్‌ సవాల్‌

ASADUDDIN OWISI
ASADUDDIN OWISI

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బెజెపి అధ్యక్షుడు అమిత్‌షాలపై హైదరాబాద్‌ ఎంపీ,ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. ధైర్యముంటే మోడీ అమిత్‌ షా హైదరాబాద్‌ నుంచి పోటీ చేసి గెలవాలనిన సవాల్‌ విసిరారు. తన మద్ధతు నేడు హైదరబాద్‌లో భారీర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ సీటును మా నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. దమ్ముంటే ఎవరైనా హైదరాబాద్‌ నుంచి ఎంఐఎం మీద పోటీ చేయాలని సవాల్‌ విసురుతున్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి సైతం ఇక్కడ పోటీ చేయాలంటూ సవాల్‌ చేశారు. హైదరబాద్‌ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌కు సైతం ఛాలెంజ్‌ చేస్తున్నా. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా మమ్ముల్ని ఓడించలేరని అసదుద్దీన్‌ అన్నారు.