ప్రత్యేక డూడుల్‌ని రూపొందించిన గూగుల్‌

doodle
doodle

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా హోం పేజిలో ప్రత్యేకంగా డూడుల్‌ని ఉంచింది. దేశ నిర్మాణ, సాంస్కృతిక ఔచిత్యాన్ని, జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ డూడుల్‌ను తయారు చేసింది. అలాగే డూడుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రాష్ట్రపతి భవన్‌, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కుతుబ్‌మీనార్‌ చిత్రం, జాతీయ పక్షి నెమలిని, జాతీయ వారసత్వ జంతువు ఏనుగును, చేతి కళలు, పంట పొలాలను ఉంచి అద్భుతంగా డూడుల్‌ను రూపొందించారు. గత కొన్నేళ్లుగా గూగుల్‌ ప్రముఖ సందర్భాలకు ఇలా ప్రత్యేక డూడుల్‌ను రూపొందిస్తుంది.