ప్రతి ఇంటికీ గ్యాస్కనెక్షన్లు

ప్రతి ఇంటికీ గ్యాస్కనెక్షన్లు
అమరావతి: గత ఏడాది విద్యుత్ సమస్యను అధిగమించామని, ఈ ఏడాది ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటమే లక్ష్యమని సిఎం చంద్రబాబునాయుడు అనఆనరు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్నారు.. పార్లమెంట్ తలుపు మూసి రాష్ట్రాన్ని విభజించటం సరైందేనా అని అన్నారు.
కష్టపడి పనిచేయటమే దేశభక్తి
కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని సిఎం అన్నారు.. ప్రతిపక్ష మాటలు చెప్పినంత సలువుగా పనులు కావు , అందుకు పట్టుదల ఉండాలన్నారు.. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో చివరిస్తానంలో ఉన్నామన్నారు.. ఇబ్బందులను అధిగమించి తలసారి ఆదాయంలో మొదటిస్థానం పొందాలన్నారు.
కష్టం మనకు శాశ్వతం కాదు
కష్టం మనకు శాశ్వతం కాదని సిఎం చంద్రబాబు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.. విభజనలో అన్యాయం జరిగింది, అలా అని ఇంట్లో పడుకుంటే ఎలా, కష్ట్టపడటమే నేర్చుకున్నాం. చేసుకుంటూపోతే అద్భుతాలు సృష్టించగలమన్నారు.
8న ప్రతిఒక్కరూ పునరంకిత దీక్ష తీసుకోవాలి
ఈనెల 8వతేదీన ప్రతి ఒక్కరూ పునరంకిత దీక్ష తీసుకోవాలని సిఎం చంద్రబాబు తెలిపారు.. నష్టం పూడ్చుకునేందుకు ఏం చేయాలో మనం దీక్షపట్టాలన్నారు. రాష్ట్రానికి పెద్ద సమస్యలు కరవు, తుఫాన్లు అని అన్నారు.