ప్రతిపక్షం లేకుండా చేయడమే కేసిఆర్‌ ధ్యేయం

mallu batti vikramarka
mallu batti vikramarka

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుందని తెలంగాణ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని సియం కేసిఆర్‌ ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సభాపతికి పిటిషన్‌ ఇచ్చామని, అక్కడి నుంచి స్పందన రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఇటీవల సభాపతికి హైకోర్టు నోటీసులు ఇచ్చే దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. అసలు ప్రతిపక్షమే లేకపోతే ప్రజాస్వామ్యము ఉండదని, ఆ ప్రజాస్వామ్యమే ఉండకూడదని కేసిఆర్‌ కోరుకుంటున్నారని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరుకుంటున్నామని భట్టి విక్రమార్క అన్నారు.