ప్రతిపక్షం పాత్ర పార్టీకే పరిమితం కాదు

Political leadership
Political leadership

ప్రతిపక్షం పాత్ర పార్టీకే పరిమితం కాదు

పెద్దనోట్ల రద్దు అమలులోకి వచ్చి నవంబర్‌ 8 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ‘బ్లాక్‌ డే పాటించాయి. ఆర్థికరంగంపై విపరీత ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడమే కాక కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల సమైక్య పోరాటాన్ని ప్రదర్శించగలిగాయి. పార్టీల వేర్వేరు సిద్ధాంతాలు, అభిప్రాయాలన్నిటినీ పక్కనబెట్టి దేశానికి తీవ్రనష్టం కలిగించిన పెద్దనోట్ల రద్దు జిఎస్‌టి వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడానికి తామంతా ఒకే బాటలో ముందుకు సాగుతామని చాటి చెప్పగలిగాయి.

ఏ ప్రజాస్వామ్యాని కైనా బలమైన ప్రతిపక్షం తప్పనిసరి.కానీ ప్రస్తుతలోక్‌సభలో గుర్తిం పు పొందిన ప్రతిపక్షం కానీ, కావలసిన సభ్యులు కానీ లేకపోవడం పెద్దలోపం.అయితే ఇది మొదటిసారికాదు. ఏ రాజకీయపార్టీ అయి నా దిగువ సభలోని మొత్తం సభ్యుల్లో పదో వంతు సభ్యులుంటే కానీ ప్రతిపక్ష హోదాలభించదు.1950నుంచి 1977వరకు గుర్తింపు పొందిన ప్రతిపక్షం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా సంపాదించడానికి కావలసిన సీట్లను పొందలేకపోయింది. అదే విధంగా 1980 నుంచి 1989 వరకు ఏడవ,ఎనిమిదవ లోక్‌సభసమయాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. చెప్పుకోదగిన ప్రతిపక్షం లేకుండాపోయింది. గుర్తింపు పొందిన ప్రతిపక్షం లేకపోవడమంటే ప్రతిపక్ష రాజకీయస్థానం శూన్యమైనట్టు కాదు. లేక అనుచితం కూడా కాదు

. వివిధ పార్టీలు స్వతంత్రంగా సమష్టిగా ప్రభుత్వవిధానాలను వ్యతిరేకిస్తూ తమ గొంతులు వినిపి స్తాయి.1977 సాధారణ ఎన్నికలకు ముందు వేర్వేరు సిద్ధాంతాలు, భావస్వారూప్యాలు కలిగిన వివిధ పార్టీలు తమ విభేదాలను విడిచిపెట్టి ఒకే లక్ష్యంతో ఏకమై ఇందిరాగాంధీని ఓడించగలిగాయి. జనతాపార్టీని రూపొందించాయి. చరణ్‌సింగ్‌కు చెందిన భార తీయ లోక్‌దళ్‌, స్వతంత్ర పార్టీ,సోషలిస్టు పార్టీకి చెందిన రాజ్‌నారా యణ్‌, జార్జి ఫెర్నాండెజ్‌, జనసంఘ్‌ ఈ పార్టీలన్నీ తమ ప్రత్యేక గుర్తింపును రద్దు చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేయగలిగారు. భారత దేశ రాజకీయ చరిత్రలో ఇదో చారిత్రాత్మక ఘట్టం. ఈ కొత్త పార్టీ ఎన్నికల్లోఅఖండ విజయంసాధించి మొట్టమొదటిసారి స్వాతంత్య్రం తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

ఎన్ని కల్లో కేవలం పొత్తులకే పరిమితం కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కొన్నిప్రత్యేక విధానాలపై ప్రభుత్వాన్ని ఎదిరించడానికి చేతు లు కలపవలసి ఉంటుంది. ఉదాహరణకు యుపిఎ-1 ప్రభుత్వ కాలంలో ప్రతిపక్షాలైన బిజెపి, వామపక్షాలు రాజకీయ కోణంలో అమెరికా పౌర అణు ఒప్పందాన్ని, వ్యతిరేకించాయి. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాయి. వామపక్షాలు మొదట్లో బయట నుంచి ప్రభుత్వా నికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో మా త్రం ప్రభుత్వానికి తమమద్దతును ఉపసంహరించుకున్నాయి. అయి నప్పటికీ ప్రభుత్వం నిలబడగలిగింది.

పార్లమెంటు ఒక వ్యవస్థ. పరిపాలన సక్రమంగా జరగడానికి సమష్టి బాధ్యత వహించి నిఘా వ్యవస్థలా ప్రవర్తించే వ్యవస్థ. ఇది ఇప్పుడు అరుదుగా మారినప్ప టికీ గతంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి.ట్రజరీ బెంబిల నుంచి సభ్యులు ప్రభుత్వాన్ని విమర్శించడం,వ్యతిరేకించడం జరిగాయి. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష గుర్తింపు పొందిన పార్టీ లేనప్పటికీ ప్రతిపక్ష గొంతు వినిపించడానికి తగినంత రాజకీయ అవకాశం ఉంది. ఏదేమైనా ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఒకే ఒక పార్టీ నిర్వహించినా ఎవరూకాదనరు.లేదా ఒకనిర్దిష్ట విధానపర అంశంపై వివిధ పార్టీలుకలిసి తమ గొంతును వినిపించవచ్చు.

ఈ విధంగా మార్గాలు ఏవైనా ముందు కావలసిన బలమైన ప్రతిపక్షం ఉండడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చక్కగా పనిచేయడానికి ఎంతో అవస రం. ఇది చివరికి ప్రజాగళం ప్రజాస్వామ్యానికి ఇదే బలం. ప్రభుత్వం తాను చట్టపరమయిన అంశాన్ని ప్రతిపాదించడం ప్రజాభిప్రాయాల ఒత్తిడికి ఆ ప్రతిపాదనను విడిచిపెట్టడం, కొత్తగా మరో చట్టాన్ని ప్రవేశపెట్టడం తదితర ఉదంతాలు గతంలో ఉన్నా యి. పార్లమెంటు బయట ఉద్యమకారులు, ఆందోళనకారులు, ప్రజ లు తమ గొంతు వినిపించడానికి ఆందోళనలు చేస్తుంటారు. తమ అభిప్రాయాలను వినిపించి కొన్ని విధానపర అంశాలను వ్యతిరేకి స్తారు.చిప్‌కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్‌, వేర్వేరు సామా జిక సాంస్కృతిక భాషాఉద్యమాలు విద్యార్థుల ఆందోళనలు, ప్రత్యే క హోదా కోసం, రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు ఇలా అనేక ఉద్య మాలకు పరోక్షంగా పార్టీలమద్దతు ఉన్నా లేకున్నా జరుగుతుంటా యి.

హింసాయుత, విధ్వంస, వర్గవైరుధ్యాల ప్రమేయం లేకుంటే ఈ ఆందోళలన్నీ ప్రజాస్వామ్యంలో సమగ్ర భాగమే. ఇటీవల కాలంలో అన్నాహజారే ఉద్యమం కారణంగానే లోక్‌పాల్‌ చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తేగలిగింది.2012 డిసెంబర్‌లో ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం దుర్ఘటనకు నిరసనగా భారీ ప్రజా ఉద్యమం హోరెత్తింది. దీని కారణంగానే 2013లో క్రిమినల్‌ చట్టంలో ప్రధానమయిన మార్పులు జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్ష అవకాశం తక్కువగా ఉన్నా పాలకవర్గాలు అసమ్మతిని ఆందోళనల ను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు వేరే మార్గాల ద్వారా తమఅసమ్మతిని తెలియచేయవలసి వస్తోంది.

కళా కారులు తమ అవార్డులను తిరిగి వాపసు చేసి ప్రభుత్వంపై తమ అసమ్మతిని తెలియచేస్తున్నారు. మేధావ్ఞలు కూడా ఇదే విధంగా కొత్త పద్ధతిలో ‘నా పేరు కాదు అన్న నినాదంతో సామాన్య ప్రజా నీకంతో కలిసి ఆందోళన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేరుపడిన మీడియా ప్రభుత్వంలోని తప్పిదాలను బయ టపెట్టి విమర్శించే నిఘా వ్యవస్థగా చైతన్య వంతమయిన పాత్ర నిర్వర్తించవలసి ఉంది. అయితే ఈ విషయంలో ప్రజల పక్షం నిల వాల్సిన మీడియా సంస్థలు కొన్ని ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహ రిస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీయడానికి బదులు ప్రతి పక్షాల డిమాండ్లలో చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ సందర్భంలో సోషల్‌ మీడియా తనదైన విశిష్టమైన పాత్ర వహించవలసి ఉంది. రాజకీయ ఉద్యమ నేతలకు, ప్రజాస్వా మ్య వాదులకు తమ అభిప్రాయాలనువివరించడానికి ప్రభుత్వం లోని లోటుపాట్లను బయటపెట్టడానికి తగినవేదికను కల్పిస్తున్నా యి. అదికూడా ప్రభుత్వ విధానాలను ఘాటుగా విమర్శిస్తే తీవ్ర ప్రమాదం లేకుండా ఉండడంలేదు.

పాలకవర్గం నుంచి దాడులు, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. 2016 నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని సమాచారహక్కు ఉద్య మనేత నోట్ల రద్దును ప్రధాని మోడీని, శివరాజ్‌ చౌహాన్‌లను తీవ్రం గా విమర్శించినందుకు జైలు పాలయ్యాడు. తమిళనాడులో ఒక ప్రయివేట్‌ చర్చావేదికలో ప్రధాని మోడీని విమర్శించాడన్న బిజెపి నేత ఫిర్యాదుపై ఒకరు అరెస్టయ్యారు. చర్చించడం, అసమ్మతి తెలపడం, అంగీకారం వ్యక్తం చేయడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రధాన సిద్ధాంతాలు.

అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు చట్టపర మయిన నేరంగా పరిగణింపబడుతోంది. అసమ్మతిని వెల్లడించడా నికి ఉన్న అవకాశం రానురానూ మరీ సన్నగిల్లుతోంది. కానీ భారత ప్రజాస్వామ్యం చాలా పటిష్టమైంది. విమర్శలను సహించలేక పాలకవర్గం భయపెట్టినా బెదరకుండా గట్టిగా ఎదిరించే శక్తిగలది రాజకీయాలకు, మీడియాలకు సంబంధం లేకుండా భారీ నిశ్శబ్ద మెజార్టీ జనం బయట ఉన్నారని ఎవరూ మరచిపోకూడదు. వారు తమ అభిప్రాయాలను, పాలనలోని వ్యతిరేక విధానాలను బహి రంగంగా విమర్శించడానికి ఒప్పుకోరు. కానీ ఓటు వేసే సమయం వచ్చినప్పుడు విచక్షణతో వ్యవహరిస్తారు.

– కె.అమర్‌