ప్రజా సంకల్పయాత్ర 14వ రోజు షెడ్యూల్‌ ఖరారు

Y S Jagan 2
Y S Jagan

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.
ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను అనుసరిస్తున్నారు. 14వ రోజు పాదయాత్ర నేడు ఉదయం
8గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములపల్లి నుంచి జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 9గంటలకు
షేక్‌ షావలీ దర్గా చేరుకొని డోన్‌ నియోజకవర్గ పార్టీ నేతలతో మాట్లాడుతారు. ఉదయం 10గంటలకు పాణ్యం నేతలతో మాట్లాడుతారు.
మధ్యాహ్నాం 12.30 బోజన విరామం తీసుకుంటారు. అదే విధంగా మధ్యాహ్నాం మూడు గంటల సమయంలో జగన్‌ బేతంచర్ల
నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. మధ్యాహ్నాం 3.30గంటలకు బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో
జగన్‌ పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు తిరిగి కోలుములెపల్లి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. రాత్రి 7.30గంటలకు
అదే గ్రామంలో బస చేస్తారు.