ప్రజాసంకల్ప యాత్ర నాలుగో రోజు

YS JAGAN

జమ్మలమడుగు:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర నాలుగో రోజు ప్రారంభమైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఉరుటూరు నుంచి జగన్‌ పాదయాత్రను మొదలు పెట్టారు. పాదయాత్ర సర్వరాజపేట, పెద్దన్నపాడు, వై.కోడూరు జంక్షన్‌, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు బైపాస్‌ వరకు కొనసాగనుంది. జగన్‌ ఇవాళ పాదయాత్రలో 10.9 కిలోమీటర్ల మేర నడవనున్నారు.