ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌

Ys Jagan
Ys Jagan

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి జగన్ గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. రాత్రి అక్కడే ఆయన బస చేయనున్నారు