ప్రజావాక్కు

ఎడిట్‌ పేజీకి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు పంపగోరేవారు ఈ కింది ఈ మెయిల్‌ [email protected] కు పంపగలరు.

letter to editor
Letter to The Editor

ప్రజావాక్కు

రాజకీయంగా మార్చవద్దు: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో భారత వైమానిక దళం మాజీ చీఫ్‌ త్యాగి అరెస్ట్‌ తీవ్ర సంచలనం సృష్టించింది. భారత సైన్యం త్రివిధ దళాల ప్రతిష్ఠ మంట కలిపే విధంగా ఉన్న ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం మరింత చురుకుగా, క్రియాశీలకంగా దర్యాప్తు జరిపించి దోషులకు కఠినాతి కఠిన శిక్షలు విధించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. గత ప్రభు త్వ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినా, దేశ అంతర్గత బాహ్య భద్రతను కాపాడే సైన్యం చరిత్రలో మాయని మచ్చగా ఒక విభాగం అధిపతి అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ కావడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ సున్ని తమైన అంశంపై ఆచి తూచి స్పందించాల్సిన అధికార, విపక్షా లు ఒకరిపై మరొకరు బాహాటంగా దుమ్మెత్తి పోసుకోవడం రాజ కీయ వివాదాలు సృష్టించడం బాధాకరం.

రాజకీయాల్లోకి యువత రావాలి: షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

దేశంలో ఎన్నికల ముఖచిత్రం మారిపోతుండడం ప్రజాస్వా మ్యానికే గొడ్డలిపెట్టు. మద్యం,ధనం, కుల,మత, వర్గ, ప్రాంతీ య బేధాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నవారు ప్రజాప్రతినిధులై పోతున్నారు. కోట్లకుపడగలెత్తిన వ్యాపారస్థులు, స్వలాభాపేక్షతో రాజకీయ రంగ ప్రవేశం చేసి తమ వ్యాపారాలు, ఆస్తులు కాపా డుకుంటున్నారు. విద్యాధికులు, మేధావ్ఞలు, సంఘ సంస్కర్తలు రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. భవిష్యత్తులో రాజకీయాల ప్రక్షాళనకు యువతను ఇప్పటి నుండే సన్నద్ధం చే యాలి. విద్యాభ్యాసం నుండే వారికి నైతిక నిష్ట వ్యక్తిగత శీలం, ,సమాజం,జాతిపట్ల తమకర్తవ్యం గురించి బోధించాలి. ్ద సి.ప్రతాప్‌,శ్రీకాకుళం రవాణా వ్యవస్థలో లోపాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల డిమాండ్‌కు తగ్గట్టు బస్సులు నడపడం లేదు. ఉదయంపూట బస్సులు తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ సమయం వేచి చూడ డంలోనే గడిచిపోతోంది. ఇక గత్యంతరం లేక డబ్బులు పెట్టి విద్యార్థులు ఉద్యోగులు ప్రయివేట్‌ వాహనాలలో వెళ్లాల్సి వస్తోం ది.ఆర్టీసి ఇంకా కొత్త బస్సులను ప్రవేశపెడితే ప్రజలకు ఉప యోగకరంగా ఉంటుంది.

ధూమపానాన్ని నిషేధించాలి: ఎమ్‌.రఘుబాబు, హైదరాబాద్‌

ధూమపానం,గుట్కా, మద్యం తదితర దురలవాట్లకు లోనైన వారి సంఖ్య గతదశాబ్దంలో గణనీయంగా పెరిగింది. పేద, గొప్ప, గ్రామం,పట్టణప్రాంతాలు అనే బేధంలేకుండా అధికులు ముఖ్యంగా యువత ఈ దురలవాట్లకు బలై తమఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు.ఈ దురలవాట్లను తగ్గించేందుకు మార్కెట్లోకి గుట్కా, ఇతర మత్తు పదార్థాలను నిషేధించాలి.

నీటి వివాదాలు: సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా రాజుకుంటున్న నీటి వివాదాలకు సత్వర శాశ్వత పరిష్కారం కోసం ఒక శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పా టు చేసే నిమిత్తమై 1956 అంతరాష్ట్ర జలవివాద చట్టానికి సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం హర్ష ణీయం. గతంలో జలవివాదాల కోసం ఇప్పటి వరకు అయిదు ట్రిబ్యునళ్లు ఏర్పాటుకాగా వీటి నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు అవ్ఞతుండగా, ఇప్పటివరకు ఒక్క వివాదం కూడా సమసిపో కపోవడం చూస్తుంటే ఈ ట్రిబ్యునళ్ల పనితీరు ఎంత అధ్వాహ్నంగా ఉందో అర్థమవ్ఞతోంది. ముఖ్యంగా కావేరి ట్రిబ్యునల్‌ తుదితీర్పు వెలువరించడానికి 25 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధి తీసుకోగా, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అశాస్త్రీయ రీతిలో వ్యవహరించి కృష్ణా జలాల పంపకం విషయంలో దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగేలా తీర్పు నిచ్చింది. ఇలాంటి విషయాల్లో చిన్న పొరపాటు జరిగినా అది పెనువివాదాలకు దారితీస్తుందని గ్రహించాలి.

సెలవులను తగ్గించాలి: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

దేశ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న సమస్యల్లో సెలవ్ఞలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నన్ని సెలవ్ఞలు మరే దేశంలోనూ ఉండవంటే అతిశయోక్తికాదు. పండుగలు, పర్వ దినాలు, నాయకుల జయంతులు,ఇలా అనేకకారణాలతో సెలవ్ఞల ను ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలకు అధిక సెలవ్ఞల వలన విద్యార్థుల చదువ్ఞ విషయంలో నష్టపోతున్నారు. ప్రజలను పనిపై దృష్టిని నిలిపే శ్రమ జీవ్ఞలుగా తీర్చిదిద్దాల్సిన విధి ప్రభు త్వానిదే. అందుకనుగుణమైన పథకాలు రూపొందించి అమలు చేయాలి. సెలవులవల్ల అన్ని రంగాల అభివృద్ధి కుంటుపడుతుం దనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేయాలి.

పునరుద్ధరించాలి: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

తెలుగు రాష్ట్రాలలోని ఎన్నోచారిత్రక నిర్మాణాలు, కోటలు, దేవా లయాలు, తదితరాలు ఆయా రాజుల కాలంలో నిర్మింపబడి, అభి వృద్ధి చెందుతూ వైభవోపేతంగా వర్ధిల్లాయి. రానురాను అవి ఆద రణకు నోచుకోక కేవలం చరిత్రకు సాక్ష్యాలుగానే మిగిలాయి. అలాంటి వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం అటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను గుర్తించి, అభి వృద్ధిపరచి, పర్యాటక శోభను తేవాలి.

మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎం. శ్రీనివాసరావు,శ్రీకాకుళం జిల్లా

నూతనంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి30 నెలలు కావస్తు న్నా తెలుగు రాష్ట్రాలలో తెలుగుకు తగ్గ ప్రాధాన్యం లభించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా తెలుగు అమలు ఆమడదూరంలో ఉంది.పలు విద్యాసంస్థల్లో మాతృభాషకు అసలు గుర్తింపే లేకుండా చేస్తున్నట్లు ప్రయివేటు విద్యాసంస్థల తీరు కన్పిస్తుంది. దీనిపై రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసు కోవాలి.ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.