ప్రజావాక్కు..

ఎడిట్‌పేజీకి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు పంపగోరేవారు [email protected] మెయిల్‌ కు పంపగలరు.

Letter to The Editor
Email to The Editor

ప్రజావాక్కు..

అవినీతిరహితంగా మార్చగలరా?: వులాపు బాలకేశవులు, గిద్దలూరు,ప్రకాశంజిల్లా

ప్రస్తుతం నగదు కొరతను తీర్చడానికి బదులు నగదురహిత లావాదేవీల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తు న్నాయి.ఇది హాస్యాస్పదంగా వ్ఞంది.పూర్తి సురక్షితంగాని సామా న్యులు అమాయకులు మోసపోయే విధానాల గురించి అంతగా ప్రచారం అవసరంలేదు. ప్రోత్సహించడానికి బదులు ఆధారపడే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించడం అతిశయోక్తిగా ఉంది. ప్రభు త్వ విభాగాల్లో రాజకీయరంగంలో చివరకు న్యాయవ్యవస్థలో మేటలువేసిన అవినీతి,లంచగొండితనాలే నల్లధనానికి మూలం. ఇప్పుడుకూడా ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయి సంపన్నవర్గాలు పరస్పరం సహకరించుకోవడం వల్లే సామాన్య జనానికి నగదు కొరత ఏర్పడుతోంది.మరి ఇంతగా ఉన్న అవినీతిని లంచగొండి తనాన్ని బాధ్యతారహిత్యాన్ని తొలగించకుండా పారదర్శక ఆర్థిక మారక విధానాలు సాధ్యమా? మన దేశంలో సంపాదన అక్రమ వ్యాపార రక్షణవంటి వాటికోసం ప్రజాసేవ ముసుగు కప్పుకునే వారు ఎక్కువైపోతున్నారు.వీరివల్ల ఉన్నతాధికార ఉద్యోగరంగా ల వారు న్యాయవ్యవస్థ,పత్రికాప్రసార వ్యవస్థలు కూడా అవి నీతికి నిలయమైపోయాయి.కనుక ముందు రాజకీయరంగాన్ని ప్రక్షాళించండి.తద్వారా దేశాన్ని అవినీతిరహితంగా మార్చవచ్చు.

జవాబుదారీగా ఉండాలి: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించిన పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌లో ప్రజలకు ఈ విషయంపై వివరణ ఇవ్వకపోవడం దురదృష్టకరం.ప్రధాని పార్లమెంట్‌కు జవాబుదారి. ఈ నిర్ణయం వలన భవిష్యత్‌లో కలిగే ప్రయోజనాలను పార్లమెంట్‌ వేదికగా దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. కాగా ఈ విష యంలో వివిధ దఫాలుగా జరిగిన కీలక చర్చలలో సభకు హాజ రుకాకపోవడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణం అయింది. అంతే కాక పార్లమెంట్‌కు గైర్హాజరు అయి వివిధ సభలలో నల్లకుబే రులకు ప్రతిపక్షాల మద్దతు ఇస్తున్నాయని దుమ్మెత్తిపోయడం విడ్డూరం. ప్రధాని ఎలాంటి ప్రకటన చేయకపోవడం వలన ప్ర భుత్వం పార్లమెంట్‌లో చర్చ జరగకుండా తప్పించుకుందన్న వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వేగంతో ప్రయాణం ప్రమాదం: వి. రాజశేఖర్‌, నల్గొండ

రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల జోరుకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా గ్రామ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు వాహ నాలు ప్రజలప్రాణాల రక్షణతో నిమిత్తం లేకుండా లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. దీనివల్ల అదుపుతప్పి ప్రమాదాలు సంభవించినప్పుడు మృతుల సంఖ్యపెరుగుతోంది. అవినీతి అధికారులున్నంత కాలం ప్రైవేటు వాహనాలకు అడ్డం ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ ఆర్టీసీ బస్సులను నడిపి ప్రైవేటు వాహనాలకు బ్రేకు వేయాలి.

కొరవడిన విద్యాశాఖ నియంత్రణ: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ విద్యాశాఖ నియం త్రణ కొరవడటంతో వాటియాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసే ఫీజుల విషయంలో నియంత్రణ లేదు. ఏడాదికి ఇన్ని వేల రూపాయలని చెప్పి వసూలు చేస్తున్నారు. అంతేగాక పుస్తకాలు, షూలు, యూనిఫామ్‌ పేరిట తల్లిదండ్రుల నుండి కొనుగోలు చేయిస్తున్నారు. వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలు ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తున్నా, భద్రత లేని బస్సులను ఏర్పాటు చేసినా అదికారులు కిమ్మనటం లేదు. ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల నీరుగార్చేవిగా, ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పాఠశాలల్లో వసతులు కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై నియంత్రణ చర్యలు చేపట్టాలి.

వైద్యవిద్య అందని ద్రాక్ష: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో వైద్యకళాశాలలకు అనుమతి ఇచ్చే ఏకైక సంస్థ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతి పాదనఅహేతుకం.నిబంధనలకు అనుగుణంగాపనిచేస్తూ రోగులకు చికిత్స చేసే అధికారం ఇచ్చే సంస్థగా మంచి పేరు తెచ్చుకున్న ఎం.సి.ఐను రద్దు చేసి మెడికల్‌ కమిషన్‌ను నియమించాలన్న ఆలోచన సమంజసంగా లేదు. ఎం.సి.ఐలో అర్హతల ఆధారంగా వైద్యులలో సభ్యులుగా ఎన్నుకోబడే వారు. కాగా కొత్త కమిషన్‌లో వైద్యరంగంలో సంబంధం లేనివారునామినేటెడ్‌ సభ్యులుగా నియ మించేందుకు అవకాశం ఉండడం వలన వైద్యరంగంలో రాజకీ యాలు ప్రవేశించే అవకాశంఉంది. కొత్త మెడికల్‌ కమిషన్‌ బిల్లులో మెడికల్‌ కాలేజీలు పెట్టేందుకు కార్పొరేట్‌ సంస్థలకు కూడా అవ కాశం కల్పించడం వలన అనేక అనర్థాలు సంభవిస్తాయి. కాపిటల్‌ ఫీజులు పెరిగిపోయి సామాన్యులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మిగులుతుంది. ఎం.సి.ఐ రద్దు వలన వైద్యులలో జవాబుదారి తనం అంతరించిపోయే ప్రమాదం ఉంది. తక్షణం కేంద్రప్రభుత్వం ఎం.సి.ఐ రద్దు ప్రతిపాదనను విరమించుకోవాలి.

దేశభక్తి గేయాలేవి?: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

పాఠశాల స్థాయిలో భాషావాచక పుస్తకాలలో పాఠ్యాంశాలకు ముందు విధిగా కొన్ని దేశభక్తి గీతాలను ఇవ్వాలి. గతంలో పాత సిలబస్‌తో ఉన్న పాఠ్యపుస్తకాలలో ప్రారంభంలో సారే జహాంసె అచ్ఛా తదితర దేశభక్తి గీతాలు ఇచ్చేవారు. వాటిని ఉపాధ్యా యులు విద్యార్థులకు నేర్పించేవారు. రానురాను వాటి ప్రాధాన్యతను తగ్గించారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా భాషా వాచకాలలో దేశభక్తి గీతాలను ఇచ్చి వాటిని విద్యార్థులు నేర్చుకొనేలా చూడాలి. అప్పుడేవిద్యార్థుల మనసులో దేశభక్తి బీజాలు నాటుకుంటాయి.